రామ్ చ‌ర‌ణ్ జంజీర్ మూవీకు కోర్టు అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో, ఈ మూవీకు సంబంధించిన మ‌రిన్ని ప్రోమోల‌ను ఈ నెల ఆఖ‌రులో రిలీజ్ చేస్తున్నారు. జులై నెల నుండి మాత్రం జంజీర్ మూవీ ప్రమోష‌న్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతుండ‌టంతో ఏక కాలంలోనే బాలీవుడ్‌,టాలీవుడ్‌ల‌లో జంజీర్ ప్రమోష‌న్ భాధ్యత‌ల‌ను ఓ మీడియా ప్లాన‌ర్ తీసుకుంది. బొంబేకు సంబంధించిన ఓ ప్రమోష‌న్ ఏజెన్సీ 5 కోట్లతో భారీ డీల్‌ను కుదుర్చుకుంద‌ని బి-టౌన్‌ స‌మాచారం.

రామ్‌చ‌ర‌ణ్‌,ప్రియాంక చోప్ర,సంజ‌య్‌ద‌త్‌, తెలుగులో సంజ‌య్‌ద‌త్ పాత్రలో శ్రీహ‌రి ఇలా భారీ తాగార‌ణంతో న‌టించిన ఈ మూవీ ప్రమోష‌న్ వ‌చ్చే నెల నుండి దాదాపు 22 రోజుల ప్రమోష‌న్ క్యాంపెన్‌ను కండెక్ట్ చేస్తున్నారు.

తెలుగు వ‌ర్షెన్‌లో రిలీజ్ అవుతున్న తుఫాన్‌కి ప్రియాంక చోప్రా 3 రోజుల క్యాంపెయిన్ షెడ్యూల్‌లో పాల్గొన‌బోతుంది. ఎవ‌డు, అత్తారింటికి దారేది, జంజీర్ ఇలా వ‌రుస‌గా మెగాహీరోల మూవీలు టాలీవుడ్ బాక్సాపీస్‌ను ట‌చ్ చేస్తుండ‌టంతో ఆభిమానుల్లో ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: