. అంకెల గురించి నాకు తెలీదు అని గౌర‌వంగా చెబుతాడు. అంతేకాదు.. నెంబ‌ర్ వ‌న్ నుంచి టెన్ వ‌ర‌కూ చిరంజీవి గారే.. అని వినమ్రంగా చెబుతుంటాడు. కానీ చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ మాత్రం... నేనే నెంబ‌ర్ వ‌న్ అంటూ కాల‌ర్ ఎగ‌రేస్తున్నాడు. ఇటీవ‌ల చ‌ర‌ణ్ ఓ ఇంగ్లీష్ మ్యాగ‌జైన్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు.

అందులో ప్రతి మాట వెనుక చ‌ర‌ణ్ ఓవ‌ర్ కాన్పిడెన్స్ క‌నిపించింది.నా సినిమా మగధీర రూ 125 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్‌లో ఇదే రికార్డు... దీన్ని మించిన సినిమా చేయాల‌ని.. అంద‌రూ ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్, నేను, మహేష్  బాబు  ముగ్గురం ఈ  రికార్డు అందుకోవాల‌ని ప్రయత్నిస్తూనే ఉన్నాం" అన్నాడు చరణ్.మ‌గ‌ధీర అత్యధిక వ‌సూళ్లు సాదించిన చిత్రమే. దానిలో డౌట్ లేదు.

కానీ చ‌ర‌ణ్ మాత్రం 125 కోట్లు అని బిల్డప్ ఇస్తున్నాడు. ఈ సినిమా  వంద కోట్ల మార్కుని చేరుకోవ‌డ‌మే అనుమానం అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతుంటే మాత్రం చ‌ర‌ణ్ అది అవ‌లీల‌గా దాటేసింద‌ని చెబుతున్నాడు ఇందులో ఎవ‌రిది నిజం??నా రికార్డుని నేనే సాధించాలి. అదొక్కటే నా ముందున్న ల‌క్ష్యం అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి?  టాలీవుడ్‌లో పోటుగాడు, నెంబ‌ర్ వ‌న్ హీరో నేనే అనే క‌దా?? 

మరింత సమాచారం తెలుసుకోండి: