స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ మధ్య వచ్చిన “ఇద్దరమ్మాయిలతో..” కలిపి డజను సినిమాలు పూర్తి చేశాడు.తన కేరియర్ లో “ఆర్య” లాంటి సూపర్ హిట్ ఉంది. “వరుడు” లాంటి సూపర్ ఫ్లాప్ ఉంది. అయితే బన్నీ మాత్రం గత దశాబ్ద కాలంలో రొటీన్ సినిమాలనే నమ్ముకున్నాడు కాని ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. ‘మగదీర’ లా సూపర్ హిట్ కొడదామని ‘బద్రినాద్’ లో చేసిన ప్రయోగం తప్ప, అయితే ఇప్పుడు ఏకంగా ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాలలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు లింగుస్వామి కి ఛాన్స్ ఇవ్వడం టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ సినిమా లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నిర్మించబడుతోంది.

ప్రస్తుతం బన్నీ కి కేరళా లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, అందుకే అతడు సినిమాలు అన్నీ మలయాళం లోకి డబ్ అవుతున్నాయి. ఇదే విధంగా తమిళనాడు లో కూడా తనకంటూ ఒక ఇమేజ్ ని పెంచుకోవడానికి బన్నీ ప్రయత్నిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మద్రాస్ లోనే పెరగడంతో అల్లు అర్జున్ కు తమిళ భాష కూడా బాగా వచ్చు. అందువల్ల కోలీవుడ్ లో పేరున్న దర్శకుడి దర్శకత్వంలో నటించాలని బన్నీ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడట. ఈ నేపధ్యంలో అనుకోకుండా లింగుస్వామి చెప్పిన కధ నచ్చడంతో వెంటనే స్టైలిష్ స్టార్ ఒకే చెప్పేశాడట. నిర్మిస్తున్నది లగడపాటి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి బడ్జెట్ కు కొదవ ఉండదు.

లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ కోలీవుడ్ ఎంట్రీ ఖాయం అయింది కాబట్టి తన మార్కెట్ ను కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లలో పెంచుకోవడానికి ఈ సినిమాను వేదికగా బన్నీ మార్చుకుంటున్నాడని టాక్. తమిళ హీరోలు సూర్య, కార్తి లకు మన తెలుగునాడు లో ఎలా పేరుందో ఇక బన్నీ సినిమాలకు కూడా తమిళనాడు లో పేరువచ్చే అవకాశాలకు అల్లు అర్జున్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కాని తన సినిమాలలో ఏదో ఒక ప్రయోగం చేసే లింగుస్వామి ఈ కొత్త సినిమాలో బన్నీ తో ఏ ప్రయోగం చేశాడో అన్న సస్పెన్స్ అందరిలో ఉంది. ఇంతకీ బన్నీ ధైర్యంగా చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా..? లేదా రాబోతున్న కాలమే నిర్ణయిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: