అస‌లే వ‌రుణ్ వాల‌కం కాస్త తేడాగా ఉంటుంది. దానికి తోడు.. పంజాబీ డ్రస్సు వేసి... బావ‌లు స‌య్యా, మ‌ర‌దలు స‌య్యా అనే పాట‌కు స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది?   ఘెరాతి ఘోరంగా ఉంటుంది క‌దా..?  స‌ర‌దాగా అమ్మాయితో సినిమాలో అదే జ‌రిగింది. ఈ సినిమాలోని ఓ స‌న్నివేశంలో వ‌రుణ్ సందేశ్ కాస్త.... ఐటెమ్ గాళ్‌గా అవ‌తారం ఎత్తాడు.

పాత సినిమాలో ఐటెమ్ పాట‌ల‌కు డాన్సులు చేసి ముమైత్‌ఖాన్‌ని మ‌ర‌పించాడు.ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వ‌చ్చింది. పోస్టర్ల మీద హ‌డావుడి త‌ప్ప సినిమాలో స‌రుకు కనిపించ‌లేదు. దానికితోడు వ‌రుణ్ అలవాటు ప్రకారం ఓవ‌ర్ యాక్షన్ చేసి త‌ల‌పోటు తెప్పించాడు. దానికి తోడు... ఈ ఐటెమ్ పాట ఒక‌టి. వ‌రుణ్ ఎప్పటికీ మ‌ర‌డా..?

అంటూప్రేక్షకులు త‌ల‌లు బాదుకొన్నారు.ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా వ‌రుణ్‌కి సినిమాలొస్తునే ఉన్నాయి. స‌ర‌దాగా అమ్మాయితో విడుద‌లై... ఫ్లాప్ ముద్ర ప‌డిన రోజే.. వ‌రుణ్ మ‌రో కొత్త సినిమాపై సంత‌కం చేశాడు. సుడి అంటే అదేనేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: