సూర్య, కార్తి.. ఇలాంటి వాళ్లను నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తాం. వాళ్ల సినిమాల్ని ప‌నిగ‌ట్టుకొని మ‌రీ హిట్ చేస్తాం. ఇంత మంచి హృద‌యం త‌మిళ తంబీల‌కు ఉంటుందా?  మ‌న వాళ్ల డ‌బ్బింగ్ సినిమాల‌న్నీ అక్కడ బోల్తా కొట్టాయి. ఒక్క టాలీవుడ్ హీరో కూడా త‌మిళంలో త‌డాఖా చూపించ‌లేకపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ పాగా వేయ‌డానికి వెళ్తున్నాడు.అవును..

అల్లు వారి పిల్లగాడు నేరుగా త‌మిళంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. త‌మిళ సీమ‌లో ఎంట్రీ ఇవ్వాల‌ని బ‌న్నీ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. అయితే డ‌బ్బింగ్ సినిమాతో అక్క డికి వెళ్లకూడ‌ద‌నేది బ‌న్నీ త‌న‌కు తాను పెట్టుకొన్న ష‌ర‌తు. ఓ మంచి కథ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాడు. అది ఇప్పటికి దొరికింది. యాక్షన్ చిత్రాల స్పెష‌లిస్టు  లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు,

తమిళ భాషల్లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు అల్లు అర్జున్. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ హీరోల‌కు అస‌లేమాత్రం అచ్చురాని చోట బ‌న్నీ అయినా అద‌ర‌గొడ‌తాడా?  మ‌న ప్రతాపం చూపిస్తాడా??  చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: