ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీనువైట్ల, రాజమౌళి,త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్ లాంటి చేయి తిరిగిన అదృష్ట వంతులు అయిన దర్శకులతో పాటు కొత్త దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల, సంతోష్ శ్రీనివాస్, సంపత్ నంది, మారుతి, సుదీర్ వర్మ, వంశీ పైడిపల్లి లాంటి కొత్త దర్శకులు కూడా టాలీవుడ్ అదృష్ట దర్శకుల జాబితాలో చేరిపోయి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ, అటు పేరూ ఇటు కోట్లాది రూపాయల పారితోషికాలు కొల్లగొట్టుకుంటున్నారు. వీరందరికీ విరుద్ధంగా దురదృష్టంమే కేరాఫ్ అడ్రెస్స్ గా ఉన్న కొంతమంది ప్రముఖ దర్శకులు కూడా ఉన్నారు. వీరి పేరు చెపితే చాలు పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ బెదిరిపోయి పారిపోతున్నారట.

 వారిలో అగ్ర తాంబూలం మెహర్ రమేష్ కి దక్కుతుంది. కంత్రి, బిల్లా, శక్తి, షాడో లాంటి వరస ఫ్లాప్స్ తీసి ఏకైక మోస్ట్ ఫైల్యూర్ డైరెక్టర్ అఫ్ టాలీవుడ్ గా పేరుతెచ్చుకున్నాడు ఈయన. మరి హీరోలను ఏమి మాయ చేస్తాడో తెలియదు కాని మాస్ మహారాజ రవితేజ కు “పవర్” అనే పేరుతొ ఒక కధను తయారు చేసి ఈ కధను సినిమాగా రవితేజ తోనా, లేక అదృష్టం ఉంటే పవన్ తోనా అనే ఆలోచనలో వీరిద్దరి మధ్యా తిరుగుతున్నాడట మెహర్ రమేష్. ఈయన తరువాతి స్థానం టాలీవుడ్ సినిమాలలో భారీ సెట్స్ కు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే గుణ శేఖర్ కు దక్కుతుంది. ఈయన హిట్ మొహం చూసి దశాబ్ద కాలం అయిపోతోంది. ఈయన చెప్పే కధలకు ఏ హీరో ఒప్పుకోకపోవడంతో ఇక తానే నిర్మాతగా మారిపోయి భారీ సెట్స్ నేపధ్యంలో అనుష్క తో “రాణి రుద్రమ” ప్రయోగం చేస్తున్నాడు. ఈ వరసలో మూడవ స్థానం బొమ్మరిల్లు భాస్కర్ ది. బొమ్మరిల్లు సినిమా తరువాత తీసిన “ఆరెంజ్” ఘోర పరాజయం చెందడంతో, ఈ ఏడాది కమర్షియల్ రంగులు పులుముకొని “ఒంగోల్ గిత్త” గా వచ్చాడు. అక్కడ కూడా పరాజయం పలకరించడంతో పట్టువీడ కుండా మరో మాస్ మసాలా కధను ఈ దర్శకుడు ఇప్పుడు తయారు చేస్తున్నాడట. చివరగా చెప్పుకోవాల్సింది నందిని రెడ్డి గురించి. తీసిన మొదటి సినిమా “అలా మొదలైంది” తో తారాజువ్వ లా పైకి వేగసి ఈ సంవత్సరమే వచ్చిన “జబర్దస్త్” తో మళ్ళి నేలపైకి వచ్చేసింది ఈ మహిళా దర్శకురాలు. ఆమధ్య రవితేజ, ఈమెకు ఛాన్స్ ఇద్దామని అనుకున్నా ఈమె దెబ్బకు భయపడి ప్రస్తుతం మాస్ మహారాజ ఈమెకు మొహం చాటేస్తున్నాడట.

పైన ఉదాహరించిన నలుగురు దర్శకులు చాలా క్రియేటివిటీ ఉన్న వాల్లే. పెద్ద పెద్ద హీరోలను ఆకట్టుకుంటూ కధలు చెప్పగలిగిన వాళ్ళే. కాని రవ్వంత అదృష్టం కూడా లేకపోవడంతో టాలీవుడ్ ఫైల్యూర్ డైరెక్టర్స్ లిస్టు లో ఈ నలుగురూ టాప్ ప్లేస్ లో చేరి పోయారు. అంతేకాదు టాప్ హీరోస్, యంగ్ హీరోస్ అందరూ కూడా ఈ దర్శకుల పెరుచేపితే భయపడి పోతున్నారట. సినిమా రంగానికి, సక్సెస్ కి ఉన్న అవినాభావ సంబంధం ఈ నలుగురిని చూస్తేనే తెలుస్తోంది. ఏ రంగంలో అయినా విజయం ఉంటేనే గౌరవిస్తారు. సినిమా రంగంలో అయితే ఇది మరీ ఎక్కువ. వీరికి భగవంతుడు విజయలక్ష్మి ని ఎప్పుడు కరుణిస్తాడో..?     

మరింత సమాచారం తెలుసుకోండి: