హీరో ప్రభాస్ కాని, దర్శకుడు రాజమౌళి కాని బాహుబలి సినిమా గురించి ఏమి అధికారికంగా చెప్పకపోయినా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు టాలీవుడ్ హాట్ టాపిక్స్ గా మారిపోతున్నాయి. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన రాజమౌళి, తన డ్రీమ్ ప్రాజెక్ట్ బాహుబలి షూటింగ్ ప్రారంభానికి వచ్చేనెల లో తెర లేపనున్నాడు. ప్రధాన తారాగణం అంతా పాల్గొనే ఈ సినిమా మొట్టమొదటి షెడ్యుల్ కేవలం మూడే మూడు రోజులు జరుగుతుందట.

ఇప్పటికే ఈ షూటింగ్ కు అవసరం అయిన మూడు భారీ సెట్స్ రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ మూడు రోజుల షెడ్యుల్ పూర్తి అయిన వెంటనే ఈ షూటింగ్ కు సంబంధించిన సన్నివేశాల విజ్యువల్ ఎఫెక్ట్స్ కోసం ముప్పై రోజులు శ్రమించి, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తయారు చేస్తారట. ఈ వ్యవహారానికి అంతా 10 కోట్ల రూపాయల ఖర్చు పెడతారట. కేవలం సినిమా ఫస్ట్ లుక్ గురించే 10 కోట్ల ఖర్చు జరుగుతోంటే సినిమా పూర్తి అయ్యే సరికి ఈ సినిమా బడ్జెట్ ఏ రేంజ్ కి చేరుతోందో అనే ఆశ్చర్యంలో టాలీవుడ్ వర్గాలు ఉన్నాయి. ఈ సినిమాలో కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీలు, బాణాలతో యుద్ధాలు స్పెషల్ ఎఫెక్ట్స్ గా కనీవినీ ఎరుగని స్థాయి లో ప్రేక్షకులకు చుపెడదామని రాజమౌళి పెట్టుదల అట.

ఇంత భారీ సినిమా కాబట్టే తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఒకే సారి నిర్మిస్తూ రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను చాటుకొంటున్నాడు. ఇలా ఈ సినిమా పూర్తి అయ్యే దాకా రోజుకు ఒక హాట్ టాపిక్ టాలీవుడ్ లో హాల్ చల్ చేస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: