.అల్లరి న‌రేష్ న‌టించిన లేటెస్ట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్  యాక్షన్  3డి. ఇండియాలో ఫ‌స్ట్ త్రిడి కామెడీ ఫిల్మ్ గా వ‌స్తోన్న యాక్షన్  3డిపై ఇటు ఇండ‌స్ట్రీ , అటు అభిమానుల్లో భారీ అంచ‌నాలే వున్నాయి. ఆ అంచ‌నాలే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం  ఛాన‌ల్స్ పోటీ పడేలా చేశాయి. అలా  అల్లరోడి  యాక్షన్ 3డికి రేటు పెరిగి జి -టివీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 3.5కోట్లకు కొనుగోలు చేయాల్సి వ‌చ్చింది.  ఇది అల్లరి న‌రేష్ కెరీర్ లో టాప్. సుడిగాడు ద‌గ్గర నుండి సుడి తిరిగిన అల్లరిన‌రేష్ సినిమాల శాటిలైట్ రైట్స్  ఇప్పటిదాకా 1.5కోట్లే   ప‌లికాయి.
��
ఇక అనిల్ సుంక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సాంగ్స్, టీజ‌ర్స్ ఇప్పటికే ప్రతి చోట హోరెత్తుతున్నాయి. అందులోనూ  ఆకాశంలో ఒక తార సాంగ్ కి రీమిక్స్ లా వున్న ఓ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఊపేస్తుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదాలు ప‌డినా ఈ సినిమా  ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మ‌రి అల్లరోడి కిత‌కిత‌లు  3డిలో ఎలా వుంటాయో జ‌స్ట్ వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: