మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా క‌ల నెర‌వేరిందా..? అంటే ఔన‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించిన త‌మ‌న్నాకు ప్రిన్స్ తో న‌టించాల‌ని ఎప్పటినుంచో కోరిక‌. ఆ కోరిక తీరే ఛాన్స్ చాలాసార్లు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారింది. కానీ చివ‌రికీ ఆగ‌డు సినిమాతో త‌మ‌న్నా డ్రీమ్, త‌మ‌న్నా కోరిక నెర‌వేర‌బోతుంది.

నిజానికి ఏ హీరోయిన్  అయినా  ప్రిన్స్ తో న‌టించాల‌ని ఊవ్విళ్లూరుతారు. నెంబర్ వ‌న్ గేమ్ లో ముందున్నాడ‌న్న రీజ‌నే  కాకుండా అంద‌గాడుక‌దా....నాచుర‌ల్ ఏ భామ అయినా ఒక్కసారి రోమాన్స్ చేయాల‌ని అనుకోవ‌డంలో త‌ప్పు కూడా లేదు. సేమ్ వే త‌మ‌న్నా  మ‌హేష్ కి జ‌త‌గా న‌టించాల‌ని అనుకుంది. సుకుమార్ డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న ఒన్ కి త‌మ‌న్నానే ముందుగా హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ చివ‌ర్లో అమ్మడిని త‌ప్పించారు.
��
బ్యాడ్ ల‌క్ ఏంటంటే ఆ మ‌ద్య త‌మ‌న్నా న‌టించిన సినిమాలు కూడా వ‌రుస‌గా బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తా కొట్టాయి. అయితే రీసెంట్ గా వ‌చ్చిన త‌డాఖా త‌మన్నా కెరీర్ కోంచెం పుంజుకునేలా చేసింది. ప్రస్తుతం త‌మిళ్ భాష‌లో ఒక‌టి, హిందీ లో ఓ సినిమా చేస్తోంది. ఇక స‌డ‌న్ గా శ్రీనువైట్ల ఆగ‌డులో ఇచ్చిన ఆఫ‌ర్ తో త‌మ‌న్నా ఉబ్బిత‌బ్బిబ‌వుతోంది. త‌న కోరిక నెర‌వేర‌డంతో పాటు పూర్వ వైభ‌వం వస్తుంద‌ని మిల్క్ బ్యూటీ ఆశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: