టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు కోసం వెంప‌ర్లాడి, చివ‌ర‌కు స‌క్సెస్‌ల మీద స‌క్సెస్‌లు కొట్టి, విప‌రీత‌మైన రేటు డిమాండ్ చేసిన గోవా బ్యూటీ ఇలియాన‌, టాలీవుడ్ మీద క‌సి తీర్చుకుంటుంది. టాలీవుడ్‌లో హీరోయిన్స్ కొర‌త వెంటాడుతూనే ఉంది. ఇలియాన‌కు బాలీవుడ్‌లో నిల‌దొక్కకోవ‌టం క‌ష్టం గానే ఉన్నప్పటికి, తెలుగు నుండి ఏమైన ఆఫ‌ర్లు వ‌స్తే,క‌నీసం ఆన్సర్ చేయ‌టానికి కూడ ఇష్టప‌డ‌టం లేదంట‌.

టాలీవుడ్‌కి వ‌చ్చే ఆలోచ‌న‌లు నాకు లేవు, అక్కడి వారు నాకు న‌చ్చలేదు, అవ‌కాశాలు రాక‌పోయినా నేను ఇంట్లో కూర్చుంటాను గాని తెలుగులో న‌టించే ప్రస‌క్తే లేద‌ని ఓ ప్రొడ్యూజ‌ర్‌కు తెగేసి చెప్పింద‌ట‌.

కోళీవుడ్ అయితే న‌టించ‌టానికి ఆలోచిస్తాను అంత‌కు మించి నాకు సౌత్ ఫిల్మ్ మీద మంచి ఒపినియ‌న్ లేదంటూ ఓ ఫేమ‌స్ టాబ్లాయిడ్‌లో చెప్పింది. ఇలియానాను ఇంత‌గా ఎవ‌రు ఇబ్బంది పెట్టారో ఇప్పుటికి అర్ధం కావ‌టంలేదు. త‌ను లీడింగ్‌లో ఉన్నప్పుడే, ఇలియానాను కాద‌ని మ‌రి కొంత మంది కొత్త హీరోయిన్లను తెచ్చుకొని యాక్ట్ చేయించుకున్నారు. ఈ విషయంలోనే ఇలియాన‌ బాధ‌ప‌డి ఉంటార‌ని కొంత మంది చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: