సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇంకా ఎన్ని మూవీలు చేస్తారు అన్నదానికి క్లారిటి వ‌చ్చిందంటున్నారు త‌మిళ మీడియా. రీసెంట్‌గా త‌మిళ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నం ప్రకారం ర‌జ‌నీకాంత్ చేతిలో ఒకే ఒక్క మూవీ ఉంది. అదీ కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న రాణా మూవీ. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ద‌ర్శక‌త్వంలో కొచ్ఛాడ‌య‌న్ మూవీ అన్ని హంగులు దిద్దుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. కొచ్ఛాడ‌య‌న్ మూవీ సంవ‌త్సరం క్రిత‌మే రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా ప్రతీ సారి విడుద‌ల‌లో ఆల‌స్యం జ‌రుగుతూనే ఉంది.

చివిరికి ఈ స‌మ్మర్‌లో రిలీజ్ కావ‌ల్సిన కొచ్ఛాడ‌న్ ఇంకో రెండు మూడు నెల‌లు ప‌ట్టే స‌మ‌యం క‌న‌ప‌డుతుంది. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో మొద‌లు పెట్టిన రాణా మూవీ, ర‌జ‌నీకాంత్ ఆరోగ్యప‌రిస్థితులను ఇర‌కాటంలో పెట్టేసింది. అస‌లే సెంటిమెంట్‌,ఆచార సాంప్రదాయాల‌ను బ‌లంగా న‌మ్మే ర‌జ‌నీకాంత్ ఆ మూవీను ప్రస్తుతానికి ప‌క్కన పెట్టాడు.

రాణా మూవీను కంప్లీట్ చేయాల‌ని ర‌జ‌నీకు ఉన్నా, సెంటిమెంట్‌తో మ‌ళ్ళీ ఆ మూవీను ట‌చ్ చేయ‌టంలేదు. ఒకవేళ చేసిన ఈ ఒక్క మూవీను చేసి ర‌జ‌నీకాంత్‌ త‌న సినీ కెరీర్‌కు రిటైర్ ఇద్దామ‌ని అనుకుంటున్నాడు. ఈ మ‌ధ్య త‌మిళ‌నాడు పొలిక‌ల్‌ను బాగా స్టడీ చేస్తున్నాడ‌ని త‌మిళ మీడియాలో ఒక‌టే ప్రచారం జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: