సూప‌ర్‌స్టార్ క్రిష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న ఒన్ మూవీ టీజ‌ర్ లాంచ్ అయింది. ఇది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఈ మూవీ టైటిల్ గంద‌ర‌గోళానికి దారితీసింది. మూవీ టైటిల్ ఒన్ కాకుండా నేనొక్కడినే అనేదే జ‌నాల్లోకి వెళ్లింది.

అంతేకాకుండా ఒన్ అనే టైటిల్ ఇండ‌స్ట్రీలోనూ నెగిటివ్ టాక్‌ను తీసుకువెళుతుంది. మ‌హేష్ తానేంటో తెలియ‌ప‌ర‌చ‌టానికే ఈ టైటిల్‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చాడ‌ని, ఇండ‌స్ట్రీలోని మ‌రో వ‌ర్గం బాహాటంగా చెబుతున్న మాట‌. గొడ‌వ‌ల‌కు, గ్రూపుల‌కు దూరంగా ఉండే మ‌హేష్ ఇటువంటి కాంట్రవెర్సీ టైటిల్స్‌కు నో అన్నాడంట‌.ఈ విష‌యాన్ని నిర్మాత‌కు చెప్పి టైటిల్ విష‌యంలో మార్పు ఉంటే చూడ‌మని త‌న స‌న్నిహితుల ద్వారా చెప్పించాడ‌ట‌.

దానిని ప‌ట్టించుకోకుండా సుకుమార్ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయాడు. ఈ మధ్య మ‌హేష్‌కు క్లారిటి ఇచ్చేందుకు వ‌చ్చిన ప్రొడ్యూజ‌ర్ కం డైరెక్టర్‌ల‌కు స‌మాధానం చెప్పకుండా, చూపుతోనే సరిపెట్టాడట‌. ఆ చూపుకు అర్ధం ఏంటో తెలియ‌క క‌న్‌ప్యూజ‌న్‌లో ప‌డిపోయారు డైరెక్టర్ కం ప్రొడ్యూజ‌ర్‌

మరింత సమాచారం తెలుసుకోండి: