ఇండ‌స్ట్రీలో క్యూట్‌ బావ‌,బామ్మర్ధులు ఎవ‌రంటే ఇట్టే చెప్పేస్తారు. ప్రేమ‌క‌థా చిత్రంతో స‌క్సెస్ గాడిలో ప‌డిన మ‌హేష్‌బాబు బావ, సుధీర్ కెరీర్ ఓ ట్రాక్‌లో వెళుతుంది. సుధీర్ ఎక్కడి వెళ్ళినా, ఏ ఫంక్షన్‌కు అటెండ్ అయినా, త‌న బామ్మర్ధి ప్రిన్స్ గురించి భ‌జ‌న చేయాల్సిందే.

ఈ భ‌జ‌న‌తోనే సుధీర్ ఏంటో, సుధీర్ ఎవ‌రో ఇండ‌స్ట్రీలో అప్‌డేట్ చేస్తుంది. లేటు వ‌స‌య‌స్సులో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చినా గ‌ట్టిగానే ప్రయ‌త్నాలు మొద‌లు పెడుతున్నాడు. మ‌హేష్‌కు అమ్మాయిల ఫాలోయిన్ పుష్కలంగా ఉండ‌టంతో బావ కూడ అమ్మాల ఫాలోయింగ్ కోసం ప‌రిత‌పిస్తున్నాడు. అందుకే ప్రిన్స్‌లాగా గ్లామ‌ర్‌ను మెయింటెన్ చేసే ప‌నిలో ఉన్నాడు. త‌న లేటెస్ట్ మూవీ ప్రేమ క‌థా చిత్రమ్ స‌క్సెస్ కావ‌డంతో సుధీర్ కెరీర్‌కు ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఎట్ ప్రెజెంట్ ప్రిన్స్ న‌టిస్తున్న ఒన్ మూవీలో ఒక నిముషం నిడివున్న సీన్‌లో గెస్ట్ అప్పీరియ‌న్స్‌గా క‌నిపిస్తాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం. అలా నిజంగానే క‌నిపిస్తే సుధీర్ రేంజ్ ఇంకోంచెం ముందుకు వెళ్ళడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: