ప్రియాంక చోప్రాకి అంద‌మే కాదు మ‌నోదైర్యం కూడా ఎక్కువ‌నే సంఘ‌ట‌న ఈ మ‌ద్య ఒక‌టి జ‌రిగింది. సినిమా స్టైల్లో జ‌రిగిన ఆ సీన్ ప్రియాంక డెడికేష‌న్ ని కూడా తెలియ‌జేసింది. అస‌లు విష‌యం ఏంటంటే ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా క్యాన్సర్ తో బాద‌ప‌డుతూ రెండు రోజుల క్రితం చ‌నిపోయారు. తండ్రి అంటే ప్రియాంక‌కు చాలా ఇష్టం. తండ్రి కోలుకోవాల‌ని ఆమె తిరుగ‌ని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. కానీ విధి రాత‌ను ఎవ్వరూ త‌ప్పించ‌గ‌ల‌రు. అశోక్ చోప్రా క‌న్ను మూశారు. విష‌యం తెలిసిన ప్రియాంక హుటా హుటిన షూటింగ్ స్పాట్ నుండి ఇంటికి వ‌చ్చి అంత్యక్రియ‌ల్లో పాల్గోన్నది. ఆ త‌రువాత 48 గంట‌ల్లోనే ప్రియాంక షూటింగ్ కు బ‌య‌లు దేరింది.

ఆశ్చర్యం అనిపించిన ఇది నిజం. తండ్రి చ‌నిపోతే దాదాపు వారం దాకా కోల్కోవ‌డం క‌ష్టం. అందులోనూ అమ్మాయిలైతే ఇంకా క‌ష్టం. మ‌రి ముఖ్యంగా హీరోయిన్స్ అయితే చాలా చాలా క‌ష్టం. ముక్కు త‌డిస్తేనే జ‌లుబు అంటూ మూడు రోజులు షూటింగ్ కు డుమ్మా కొడ‌తారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం వ‌ర్క్ ప‌ట్ల డెడికేష‌న్ తో త‌న త‌దుప‌రి సినిమా కోసం ఒలంపిక్ ట్రైన‌ర్ హ‌ల్బర్ట్ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెష‌న్ కి అటెండ్ అయింది. నిజంగా ప్రియాంక మ‌నో దైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే......

మరింత సమాచారం తెలుసుకోండి: