పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా సాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని అత్యధిక మొత్తంలో అమ్ముడిపోయి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఈ సినిమాకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకుండా మరో సంచలనానికి ఈ సినిమా కేంద్ర బిందువు అవుతోంది. తెలిసిన ప్రచారం ప్రకారం ఈ సినిమా ధియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో, డిజిటల్ మ్యూజిక్ డీల్స్ ఒప్పందాల రూపంలో ఈ సినిమా నిర్మాతకు విడుదలకు ముందే 55 కోట్లు వరకూ వస్తున్నాయని టాక్.

 పవన్ కళ్యాణ్ ఫేల్యూర్ సినిమాలకు కూడా 40 కోట్ల వరకూ వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అందువల్ల విడుదలకు ముందే ఈ సినిమాకు ఇంత భారీ ఆఫర్స్ రావడం ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం యూరప్ లో సమంత, ప్రణితలతో రోమేన్స్ చేస్తున్న పవన్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, రొటీన్ పాత్రలకు భిన్నంగా పవన్ నటన ఈ సినిమాకు హైలెట్స్.... 

మరింత సమాచారం తెలుసుకోండి: