ప్రతి ప్రముఖ ద‌ర్శకుడికీ ఓ టీం వుంటుంది. ఆ టీంతోనే ప్రతి సినిమా చేస్తూ హిట్స్ కొడుతుంటారు. అలాగే ఎ.ఆర్.మురుగ‌దాస్ సినిమా అంటే హీరో హీరోయిన్, ప్రొడ్యుస‌ర్ , పేర్లు మారినా ఆయ‌న టీంలో హ‌రీష్ జైరాజ్ పేరు మాత్రం కంప‌ల్సరీగా వుంటుంది. .ఈ ఇద్దరికి క‌రెక్ట్ గా ట్యూన్ అయింది కాబ‌ట్టే వ‌రుస విజ‌యాలు అందుకున్నారు. గ‌జినితో మొద‌లైన ముర‌గదాస్, హారీష్ ల కాంబినేష‌న్ ఆ త‌రువాత సెవెన్త్ సెన్స్, తుపాకీ సినిమాల దాకా సాగింది . నిజానికి మురుగ‌దాస్ సినిమాల‌కి హారిష్ స్పెష‌ల్ కేర్ తీసుకుని మ‌రీ మ్యూజిక్ అందిస్తాడు. అందుకేనేమో ముర‌గ‌దాస్ సినిమా పాట‌లు మళ్లీ మ‌ళ్లీ వింటుంటారు మ్యూజిక్ ల‌వ‌ర్స్. అయితే ఇపుడు ఈ కాంబినేష‌న్ కి బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

త‌న తుఫాకీ హీరో విజ‌య్ తో చేయ‌నున్నమ‌రో సినిమాకు హ‌రీష్ ను ప‌క్కన పెట్టేసి వై దిస్ కొల‌వెరీ ఫేం అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడ‌ట‌. అంతేకాదు త‌న డైరెక్ట్ చేయ‌నున్న సినిమాకే కాదు...శివ‌కార్తీకేయ‌న్, హ‌న్సిక కాంబినేష‌న్ లో ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు కూడా అనిరుధ్ నే సంగీత ద‌ర్శకుడిగా ఎంచుకుని హారిష్ కి షాక్ ఇచ్చాడు మురుగ‌దాస్.

దీంతో ముర‌గ‌దాస్ , హారిష్ ల మ‌ద్య విభేదాలు వ‌చ్చాయ‌ని, హారీష్ ఫ్రెష్ ట్యూన్స్ ఇవ్వని కార‌ణంగానే ప‌క్కన‌పెట్టేశాడ‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో కొద్దిరోజుల్లోనే తేల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: