తన పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తూ జీవన గమనాన్ని నిర్దేశించే తండ్రికి మించిన హీరో ఎవరూ ఉండరు. చిన్న తనంలో పిల్లందరికీ తండ్రే రోల్ మోడల్ ఎందుకంటే వారి కోరికలు తీర్చే గని తండ్రి. నాన్నంటే త్యాగం, నాన్నంటే సహనం, నాన్నంటే ధైర్యం, నాన్నంటే భరోసా. అందుకే ఆయన వారికి రోల్ మోడల్.

‘ఫాదర్స్ డే’ పురస్కరించుకుని భారతదేశంలోని ఒక ప్రముఖ వెబ్ సైట్ మోస్ట్ పాపులర్ డేడ్ ఆఫ్ ఇండియా అని అంశంపై ఒపీనియన్ పోల్ నిర్వహిస్తే బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ 34.83% ఓట్లతో ప్రధమస్థానంలో నిలిచాడు, ద్వితీయస్థానంలో బిగ్ బి అమితాబ్ బచన్ 31.58% ఓట్లను పొందారు, ఇక తృతీయస్థానం ఇండియన్ క్రికెట్ దేముడు సచిన్ కు 18.61% ఓట్ల ద్వారా లభించింది. అతిత్వరలో విడుదల కాబోతున్న షారుఖ్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ బిజీలో ఉన్న షారుఖ్ ఈ వార్త విని మంచి జోష్ మీద ఉన్నాడట.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నారులలో కనీసం 20% మంది చిన్నారులకు నేడు నాన్న సంరక్షణ లేదు. పిల్లలను కన్న ప్రతివారు తండ్రి అవుతారు కానీ వారిని సవ్యమైన రీతిలో పెంచిన వారే నాన్న కాగలరు. రేపటి పౌరులుగా వరిపిల్లలను తీర్చి దిద్దుతున్న నాన్నలందరికీ ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు....

మరింత సమాచారం తెలుసుకోండి: