స‌మంత చెప్పిందొక‌టి, మీడియాలో వ‌చ్చేదొక‌టి. నేను ఏ విష‌యం చెప్పినా నాకు ఎఫైర్లు ముడిపెడుతున్నారెందుకో అంటూ మీడియా మీద క‌స్సుబ‌స్సు లాడింది. ఈ విధంగా చేస్తే నేను నా అభిమానులకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలో అర్ధం కావ‌టం లేద‌ని తెగ బాధ‌ప‌డుతుంది.

రీసెంట్‌గా ఓ బేబి గురించి ట్వీట్ చేసిన స‌మంతాకు, సిద్ధార్ధ్‌తో అమ్మాకావాలని కొన్ని మీడియాల్లో, ఓ ఇంగ్లీష్ డైలీలో వార్తలు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై మండిప‌డిన స‌మంత ఇటువంటి రూమ‌ర్స్‌ను న‌మ్మకండి అంటూ మ‌ళ్ళీ మెసేజ్ ఇచ్చింది. నాకు,సిద్ధార్ధ్ మ‌ధ్య స్నేహం త‌ప్పితే, అంత‌కు మించి రిలేష‌న్ లేద‌ని ముందే చెప్పాను. ఇప్పుడూ అంతే, ద‌య‌చేసి రూమ‌ర్లు న‌మ్మద్దు అంటూ మీడియాను వేడుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: