భార‌త‌దేశం గొప్పగా చెప్పుకోద‌గ్గ న‌టుల్లో క‌మ‌ల్‌హాస‌న్ ఒక‌రు. త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుడ్ని సైతం చ‌లింప‌చేయ‌గ‌ల‌ న‌వ‌ర‌సాల న‌ట‌నా వైవిధ్యం క‌మ‌ల్‌హాస‌న్ సొంతం. ఈ రోజు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా క‌మ‌ల్‌హాస‌న్ గారాల‌ ప‌ట్టి శృతిహాస‌న్ త‌న డాడీ గురించి ప్రత్యేకంగా చెప్పింది. ప్రతి విష‌యాన్ని డాడీతో షేర్ చేసుకునే శ్రుతిహాస‌న్ ఆ విష‌యాన్ని మాత్రం దాచిపెట్టింద‌ట‌.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్తలో శ్రుతిహాస‌న్‌కు న‌ట‌న గురించి చాలా త‌క్కువ తెలుస‌ట. డాడీతో మాట్లాడిన ప్రతీ సారి, నాకు న‌ట‌న గురించి ఎన్నో విష‌యాలు చెప్పేవాడు. కొన్ని నాకు అర్ధం అయ్యేవి, కొన్ని అర్ధం కావు. నా మొద‌టి సినిమా అప్పుడు నేను యాక్టింగ్‌లో చాలా పూర్‌. గ‌బ్బర్ సింగ్ మూవీలో నా న‌ట‌న‌ను చూసిన డాడీ, ప‌ర్వాలేదు డెవ‌ల‌ప్ అయ్యావు అన్నాడు.

ఆ త‌రువాత ఒక రోజు నేను ఒక డైరీను చ‌దువుతుంటే నాన్న నా ద‌గ్గరికి వ‌చ్చి చూశాడు. అందులో డాడీ నాకు న‌ట‌న గురించి చెప్పిన విషాయ‌లు అందులో రాసుకున్నాను. అది చూసి నాన్న ఎంతో ఆనంద ప‌డ్డారు. ఆ విధంగా నాన్న చెప్పిన విష‌యాలు డైరీలో రాసుకున్నట్టు నాన్నకు అస్సలు తెలీదు. న‌న్ను న‌ట‌నా ప‌రంగా ముందుకు తీసుకుపోతుంది ఆ డైరీనే అని, తండ్రితో ఉన్న అనుబందాన్ని షేర్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: