ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలకు దర్శకుడిగా, ప్రేమకథా చిత్రమ్ కు పర్యవేక్షకుడిగా మారుతి మంచి పేరునే సంపాదించాడు. మారుతి సక్సెస్ ట్రాక్ రికార్డు చూసి ఇప్పుడు కుర్ర హీరోలతో పాటు టాప్ హీరోలు కూడా మారుతీతో ఓ మూవీ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి టైంలో మారుతిపై నెగిటివ్ టాక్ వినిపిస్తే ఆసక్తి కలగడం సహజమే మరి. 
 
ఇంతకి మారుతీ పై వినిపిస్తున్న నెగిటివ్ టాక్ ఏమిటంటే, మారుతి చేసే  చిత్రాలలో నటించే ఆర్టిస్టుల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నాడని. ఒక్క మారుతి అనే కాదు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఆర్టిస్టులకు వేషాలు ఇచ్చి మనీ వసూల్ చేస్తున్నారని తెలిసినా ఇంతవరుకు మారుతి పేరు బయటికి  వచినట్లుగా ఎవరి పేరు బయటికి రాలేదు. అయితే మారుతి మాత్రం  ఎదురు డబ్బులు ఇచ్చి మరి సినిమా ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంటే కాదని అనలేడు కదా?
 
ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు కొందరు తమ పుత్రరత్నాలను హీరోలుగా పరిచయం చేయవలసిందిగా మారుతిపై వత్తిడి తెస్తున్నారట. రీసెంటుగా అందిన సమాచారం ప్రకారం ఆ మద్య 'రాజమౌళితో సినిమా చేసిన నిర్మాత' ఒకరు తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తే రేమ్యూనరేషనుతో పాటు 25 లక్షలు ఇస్తానని చెప్పినట్లుగా తెలిసింది. మరి ఆ నిర్మాత ఎవరో గెస్ చేయండి?

మరింత సమాచారం తెలుసుకోండి: