ఎన్నడూ ఏ హీరో మీద నెగిటివ్ కామెంట్స్ చేయ‌ని ప్రభుదేవా, బాలీవుడ్ బాక్సాపీస్ హీరో సల్మాన్‌ఖాన్ మీద విరుచుకుప‌డ్డాడు. స‌ల్లూభాయ్‌ను పొగిడినట్టు అనిపించినా, అందులోని మీనింగ్ స‌ల్మాన్‌ను ఇండైరెక్ట్‌గా కామెంట్ చేసిన ఫిలింగ్‌నే తెప్పిస్తుంది.

స‌ల్మాన్ హీరోగా మెంట‌ల్ పేరుతో తెర‌కెక్కుతున్న మూవీకు ప్రభుదేవా డైరెక్టర్‌. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుండి ప్రతి రోజు స‌రైన టైంకు స‌ల్మాన్ రావ‌డం లేదు. ఇదే విష‌యం బాలీవుడ్ మీడియా చాలా సార్లు ప్రొడ్యూజ‌ర్లను అడిగింది. స‌ల్లూభాయ్ లేటు వ‌స్తున్నాడు క‌దా మీకు ప్లాబ్లమ్ లేదా అంటే కొంద‌మంది చెప్పుకోవ‌డానికే భ‌య‌ప‌డ్డారు. ఇదే విష‌యాన్ని ప్రభుదేవాని అడిగారు. దీంతో స‌ల్మాన్‌ను పొగిడిన‌ట్టే పొగిడి, త‌న కోపాన్ని ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు.

ప్రతి ఒక్కరూ స‌ల్మాన్‌ఖాన్ టైమింగ్స్ అడుగుతుంటే నాకు వింతగా ఉంది. త‌ను లేట్‌గా వ‌స్తున్నాడు నిజ‌మే. కాని త‌న మూవీలు ప్రతి 5 నెల‌ల‌కి ఒక‌సారి రిలీజ్ అవుతున్నాయి. త‌న హార్డ్ వ‌ర్క్ కూడ అలాగే ఉంటుంది. త‌న హిట్లు మీద హిట్లు ఇస్తున్నాడు. ప్రొడ్యూజ‌ర్లు లాభాలు వ‌స్తున్నాయి. స‌ల్మాన్ లేటు రావ‌డంతో మాకు ఇబ్బంది ఉన్నా, రిజ‌ల్ట్ బాగానే వ‌స్తుంది క‌దా, నో ప్రాబ్లమ్ అన్నాడు. ఈ స్టేట్‌మెంట్ ను విన్న స‌ల్లూభాయ్ కొద్దిగా బాధ‌ప‌డ్డాడంట‌. స‌ల్మాన్ టైమింగ్స్ గురించి ఇంత డిటైల్‌గా భ‌యం లేకుండా మాట్లాడిన వ్వక్తి ఎవ‌రైన ఉంటే అది ప్రభుదేవానే. ఏదో ఒక రోజు ప్రభుదేవాకు స‌ల్మాన్ చెక్ పెట్టడం ఖాయం అంటున్నారు బి-టౌన్‌

మరింత సమాచారం తెలుసుకోండి: