సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్   ఎప్పుడుఎప్పుడా అని ఎదురు చూస్తున్న  కొచ్చాడ‌యాన్ రిలీజ్ కి రెడీ అవుతోంది.  ట్రైల‌ర్  కూడా  ఆల్ రెడీ ఎడిట్ అయింద‌ట‌. అతి త్వర‌లో కొచ్చాడయ‌న్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నాం అంటూ మూవీ యూనిట్ అంటోంది.

ర‌జనీకాంత్ డాట‌ర్ సౌంద‌ర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా 3డి లో ఇండియాలోనే ఫ‌స్ట్  టైం మోష‌న్   క్యాప్చర్ ఫార్మెట్ లో  రూపుదిద్దుకుంటోంది.  ఈ మ‌ద్యే షూటింగ్ ఫినిష్ చేసుకున్న కొచ్చాడ‌యాన్ పోస్ట్ ఫ్రొడ‌క్షన్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అందులో భాగంగా ఆర్కెస్ట్రాలో ఆరువంద‌ల ట్రాక్ ల‌ను ప్రముఖ సింగ‌ర్,  మ్యూజిక్ డైరెక్టర్ జెఫ్ ఫాస్టర్ మిక్స్ చేస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని ఎ.ఆర్.రెహామాన్ ట్వీట్ చేశాడు.
��
ఇక ర‌జనీకాంత్ కి జోడిగా దీపికా పదుకొనే న‌టిస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీపావ‌ళికి ప్రేక్షకుల ముందుకు వ‌చ్చే ఛాన్స్ వుంద‌ని డైరెక్టర్ సౌంద‌ర్య అంటోంది. సో  దీపావ‌ళి రోజున  ర‌జనీకాంత్  అభిమానుల‌కి  రెండు పండుగ‌ల‌న్నమాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: