మంచు ఫ్యామిలిని, బ్రాహ్మణుల‌కి జ‌రిగిన ర‌భ‌స అంతా ఇంతా కాదు. అన్న మంచు విష్ణు యాక్ట్ చేసిన దేనికైన రెడీ మూవీ గొడ‌వ‌ను మ‌ర‌చిపోక ముందే త‌మ్ముడు మంచు మ‌నోజ్ పోడుగాడిగా ముందుకు వ‌స్తున్నాడు.

లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోటుగాడు టీజ‌ర్ దేనికైన రెడీ ట్రైల‌ర్‌ను గుర్తుకు చేస్తుంది. పోటుగాడి టీజ‌ర్‌లో అన్ని మ‌తాల వారిని చూపిస్తూ గోవిందుడితో డైలాగ్ చెప్పాడు. ఇది మ‌రో ప్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నప్పటి, మంచు మ‌నోజ్ గెట‌ప్స్ చూసి బ్రాహ్మణ సంఘాలూ మ‌ళ్ళీ మంచు ప్యామిలీతో సై అంటే సై అంటున్నాయి. ఈ గెటప్స్ ఆంత‌ర్యం ఏంటో ఆర్ధం కాక‌, మూవీను చూపిచాల్సిందే అంటూ మ‌ళ్ళీ పాత పాట‌ను మొద‌లుపెట్టాయి ఆ సంఘూలు.

ఇలా అన్నా,ద‌మ్ములు బ్రాహ్మణుల గెటప్స్ వేసి, క్రాంటవెర్సీతో బాగానే క్యాష్ చేసుకుంటున్నా, ఈ సారి పోటుగాడిలో ఏమైన తేడా వ‌స్తే, త‌ఢాఖా చూపిస్తామంటున్నా బ్రాహ్మణ సంఘాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: