టాలీవుడ్ మిల్కీ బాయ్ మహేష్ తో  నటించే అవకాశం వస్తే ఏ కథానాయికైనా వదులుకుంటుందా? కానీ   ఒక్కసారి కాదు, రెండుసార్లు కుదరదని చెప్పేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. మూడోసారి మాత్రం పచ్చ జెండా ఊపింది. మొదట రెండుసార్లు నో చెప్పడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. కాల్షీట్లు, పారితోషికం లాంటి విషయాల్లో తమన్నా చాలా పర్ఫెక్టుగా ఉంటుందని చెబుతుంటారు.. ఏ సినిమాకి తక్కువ కాల్షీట్లు అవసరమో ఆ సినిమాని ఒప్పుకుంటుందట తమన్నా. అలా చేస్తే సమయానికి సమయం, డబ్బుకు డబ్బు కలిసొస్తాయని ఆమె తెలివి తేటలు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కోసం మొదట తమన్నాని సంప్రదించారట. కుదరదని చెప్పిన ఆ అమ్మడు ఆ సినిమాని కాదని పవన్ కళ్యాణ్ తో "కెమెరా మెన్ గంగతో రాంబాబు" చేసింది ఈ సినిమా కోసం తమన్నా అతి తక్కువ కాల్షీట్లు కేటాయించింది అని అంటారు. వాటిలో కొన్నిటిని మిగిల్చి తమన్నాకి బోనస్ గా ఇచ్చాడు పూరి. 

ఆ తర్వాత  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1" కోసం తమన్నాని అడిగారని రూమర్. సుకుమార్ సినిమాను ఆలస్యంగా తీస్తాడు కాబట్టి  ఆ సినిమా ఎలాగో లేట్ అవుతుందని తెలుసుకున్న తమన్నా కాల్షీట్ల సమస్య ఉందంటూ తోసి పుచ్చింది. హిందీలో సినిమా చేస్తున్నాననే కారణం కూడా చూపింది. మహేష్ సినిమా అంటూ ఆశపడితే ఆదాయం కోల్పోవాల్సి వస్తుందనేది తమన్నా అభిప్రాయం. ఇప్పుడు మాత్రం తమన్నా చేతిలో పెద్దగా  సినిమాలేమీ లేవు. హిందీలో చేసిన హిమ్మత్ వాలా  సినిమా కూడా బోల్తా కొట్టింది. దీంతో విధిలేక ఈ మిల్కీ బ్యూటీ   కొన్నాళ్ళుగా పనిగట్టుకొని మహేష్ నామ జపం చేస్తోంది. ఇన్నాళ్ళు మహేష్ తో నటించడం కుదరలేదు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటూ సంకేతాలు పంపడం మొదలు పెట్టింది.. ఇంకేముంది  శ్రీను వైట్ల సినిమా అమ్మడి ఓడిలోకి వచ్చి చేరింది.

అసలే కథానాయికల  కొరత కావడంతో ప్రత్యామ్నాయం లేక మహేష్ కూడా తమన్నాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అంటున్నారు. కానీ మరొక సమస్య ఉంది  తమన్నా అందంగానే ఉంటుంది కానీ కొద్దిగా ముదురు లుక్  మరి ఈ ముదురు లుక్ మహేష్ తమన్నాల లవ్ కెమిస్ట్రీకి ఆన్ స్క్రీన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎదిఎమైనా మిల్కీ బ్యూటీ మిల్కీ బాయ్ ని పట్టేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: