నాగ‌చైత‌న్యతో ఏమాయ చేసావెతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌కరించిన స‌మంత ఆ త‌రువాత చూస్తుండ‌గానే టాప్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఫ‌స్ట్ హీరో సెంటిమెంట్ బాగానే వుంది. అందుకే కొంచెం బిజీగా వున్న ఆటోన‌గ‌ర్ సూర్యలో మరోసారి జ‌త క‌ట్టింది. అయితే ఆ సినిమాను స్పెష‌ల్ షో వేయించుకుని చూసిన నాగార్జున‌,  స‌మంత  నాగ‌చైత‌న్యల  పెయిర్ బాగుంది హాలో బ్రద‌ర్ రీమేక్ లో స‌మంత‌నే అత‌డికి జోడిగా పెట్టమ‌ని సిపార్స్  చేశాడు.

ఇక ఆ తరువాత  స‌మంత‌తో ముచ్చట‌గా మూడోసారి అని చెప్పడం,  హిట్ పెయిర్ అంటే సినిమాకు చాలా ప్లస్ అవుతుంద‌ని చెప్పడం,   స‌మంత  ఓకే చెప్పడం టకా ట‌కా జరిగిపోయాయి. ర‌మ్య కృష్ణ చేసిన మాస్ రోల్ కి మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా , సౌంద‌ర్య పాత్రకు స‌మంత‌ను అనుకున్నారు. అయితే ఇపుడు స‌మంత పెద్ద హీరోల సినిమాల వ‌ల్ల హాలో బ్రద‌ర్ రీమేక్ కి కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయ‌లేక‌పోయింద‌ట‌. అందుకే ఫ‌స్ట్ హిట్ ఇచ్చిన నాగ‌చైత‌న్యను బాద‌పెట్టలేక సారీ చెప్పి ఓ హ‌గ్ ఇచ్చి ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ట‌.
��
అలా స‌మంత సినిమా నుండి త‌ప్పుకోగానే ఆమె ప్లేస్ ని  హాన్సికతో రీ ప్లేస్ చేశారు డైరెక్టర్. అయితే ముచ్చట‌గా మూడోసారి నాగ‌చైత‌న్య, స‌మంత‌ల‌ను చూడాల‌ని అనుకున్న అక్కినేని ఫ్యాన్స్  ఆమె నిర్ణయంతో కాస్త డిస్సాపాయింట్ అయ్యార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: