సౌత్ లో ఎంత రెమ్యూన‌రేష‌న్ అందుకున్నా....ఎంత పెద్ద స్టార్ తో నటించినా...బాలీవుడ్ లో ఒక్కసారి మెరిస్తే చాలు అనుకుంటుంటారు హీరోయిన్స్. అందుకు ప్రియ‌మ‌ణి మిన‌హాయింపు కాదు. టాలీవుడ్ లో స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించిన ఈ సుంద‌రి నార్త్త్ లో పాగ వేయాల‌ని గ‌తంలో ట్రై చేసింది. కానీ ఆమె న‌టించిన రావ‌ణ్, ర‌క్తచ‌రిత్ర సినిమాలు బాలీవుడ్ లో అంత‌గా ఆఫ‌ర్లు తెచ్చిపెట్ట లేక‌పోయాయి. కానీ ఇపుడు ల‌క్కీగా వ‌చ్చిన ఛాన్స్ ని ప్రియ‌మ‌ణి క‌రెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంది.

ప్రజెంట్ ప్రియ‌మ‌ణి షారుక్ ఖాన్ న‌టించిన చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఐటం సాంగ్ చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. నిజానికి ఐటం సాంగ్ లో చిందేయ‌డానికి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ క్యూలో వున్నప్పటికీ ల‌క్కీగా ప్రియ‌మ‌ణికి ఆ ఛాన్స్ ద‌క్కింది. దొరికిన అవ‌కాశాన్ని వ‌దులుకుంటుందా..? ఐటం సాంగ్ కోసం త‌న బాడీ లాంగ్వేజ్ మార్చుకుంది. ఐటం సాంగ్ లో ఏ పార్ట్ చూసి ఆడియెన్స్ విజిల్స్ కొడ‌తారో ఆ పార్ట్ ని మ‌రింత నాజూకుగా మార్చేసింది. . . అంతేకాదు డాన్స్ మాస్టర్ రాజు సుంద‌రం వేయించిన హార్ట్ స్టెప్స్ రిస్క్ తీసుకోని మ‌రీ చేసింద‌ట‌. మ‌రి ఇంత శ్రద్ద తీసుకుంటే ఔట్ పుట్ లేకుండా వుంటుందా? అదే జ‌రిగింది.

లెటెస్ట్ గా రిలీజైన చెన్నై ఎక్స్ ప్రెస్ ఐటం సాంగ్ ఫ‌స్ట్ లుక్ కి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రియ‌మ‌ణి ఇర‌దీసింది అని హీరోయిన్స్ కూడా అంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మ‌రో విశేషం ఏంటంటే ప్రియ‌మ‌ణి ఈ ఐటం సాంగ్ కి ఒక్క పైసా కూడా తీసుకోవ‌డం లేద‌ట‌. షారుక్ తో స్టెప్స్ వేసే ఛాన్స్ రావ‌డ‌మే అదృష్టంగా భావిస్తున్నాన‌ని, అందుకే డ‌బ్బులు తీసుకోకుండానే పాదం క‌దిపాన‌ని అంటోంది అందాల ప్రియ‌మ‌ణి. ఇక ఫ‌స్ట్ లుక్ లోనే ప్రియ‌మ‌ణి ఇంత ఎట్రాక్ట్ చేస్తే టోటల్ సాంగ్ లో ప్రియమ‌ణి ఆట‌ను , అందాన్ని చూసి బి టౌన్ ఆడియెన్స్ ఏమంటారో. ?

మరింత సమాచారం తెలుసుకోండి: