హాస్య‌న‌టుడు అలీ త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నాడా?  ప్ర‌స్తుతం చిత్ర‌సీమ‌లో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. అలీ రాజ‌కీయాల‌వైపు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని త్వ‌ర‌లోనే అటు వైపు అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని... చెప్పుకొంటున్నారు. అలీ హంగామా చూస్తుంటే అదంతా నిజ‌మే అనిపిస్తోంది. ఇటీవ‌ల అలీ...

తెలుగు దేశం నాయ‌కుల‌తో ఈ విషయం మీద చ‌ర్చలు జ‌రిపిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.అలీ మన‌సంతా టీడీపీ వైపే ఉంద‌ని అత‌ని స‌న్నిహితులు సైతం చెబుతున్నారు. రాజ‌మండ్రి అసెంబ్లీ సీటు కోసం అలీ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని స‌మాచార‌మ్‌!  అటు కాంగ్రెస్ పార్టీ కూడా అలీకి గాలం వేస్తోంద‌ట‌.

`నువ్వు కోరుకొన్న చోట సీటు ఇప్పిస్తాం. మా పార్టీలోకి వ‌చ్చేయ్` అని రాయ‌బారాలు పంపిస్తున్నార‌ట‌.అలీకి అటు తెలుగుదేశం నేత‌ల‌తోనూ, ఇటు కాంగ్రెస్ లీడ‌ర్ల‌తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. మ‌రి ఎటువైపుకు వెళ్తాడో, ఎవ‌రి త‌ర‌పున పోటీ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: