సినిమావాళ్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం కొత్త కాదు, వింత అస్స‌లు కాదు. వ‌చ్చిన వాళ్లు నిలుస్తార‌ని, గెలుస్తార‌ని అనుకోవ‌డానికీ వీల్లేదు. బ‌హిరంగ స‌భ‌ల‌కు వ‌చ్చిన‌వాళ్లంతా ఓట్టేసి గెలిపిస్తార‌ని న‌మ్మ‌కాల్లేవు. చాలా మంది విష‌యంలో ఈ పొర‌పాటే జ‌రిగింది. ఈసారి ఎన్నిక‌ల్లో కూడా సినీ న‌టులు రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే అవ‌కాశం ఉంది. కొత్త‌గా అలీ పేరు కూడా వినిపిస్తోంది.అలీ తెలుగుదేశం పార్టీ త‌ర‌పునుంచి పోటీ చేస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది.

టీడీపీ కూడా అలీకి కోరిన చోట సీటు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంది. అలీ మ‌న‌సులోనూ రాజ‌కీయాల ఆలోచ‌న ఉంది. కానీ బ‌య‌ట ప‌డ‌డం లేదు.  ఇటీవ‌ల త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల్ని ఖండించాడు కూడా. ``నాకు నిజంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేదు. ఉంటే త‌ప్ప‌కుండా చెబుతా..`` అంటున్నాడు అలీ! మ‌న‌సులో రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉన్నా, ఎందుకు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు?  అనేది స‌ర్వ‌త్రా చర్చ‌నీయాంశం అయ్యింది.ప్ర‌స్తుతం హాస్య న‌టుడిగా బిజీ బిజీగా ఉన్నాడు అలీ.

అది వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో అనేది అలీ అనుమానం. గెలిస్తే ఫ‌ర్వాలేదు. ఓడితే మాత్రం కాంగ్రెస్ వాళ్లు త‌న‌ని శ‌త్రువుగా చూస్తారు. అన్న‌య్య అని ప్రేమ‌గా పిలుచుకొనే చిరంజీవితోనూ శ‌త్రుత్వం పెంచుకోవ‌ల‌సి వ‌స్తుంది. అందుకే.. అలీ ఏమాత్రం తొంత‌ర‌ప‌డ‌డం లేదు. కానీ.. త‌ప్ప‌కుండా ఓదో ఒక రోజు అలీ.. టీడీపీ జెండా ప‌ట్టుకోవ‌డం ఖాయం. అయితే అది 2014 ఎన్నిక‌ల‌కా?  లేదంటే 2019లోనా?  అనేది మాత్రం తేలాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: