తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశం చాలా గొప్ప‌ది అంటారు. గొప్ప అవ‌కాశాల వ‌ల్లే.. సాధార‌ణ న‌టులు కూడా గొప్ప‌వాళ్లుగా మారారు. ఈ విష‌యం తెలీక‌... కాజ‌ల్ చాలా తొంద‌ర‌ప‌డుతోంది. త‌ప్పుచేస్తోంది. కాజ‌ల్‌కి ఇదివ‌ర‌క‌టిలా చేతినిండా సినిమాల్లేవు. ఆమె కోసం క్యూ క‌ట్టే నిర్మాత‌లు ఇప్ప‌టికీ ఉన్నా - ఆమె కెరీర్ ఇది వ‌రకు ఉన్న జోష్‌లో మాత్రం లేద‌నే విష‌యం స్పష్ట‌మ‌వుతోంది.అయినా స‌రే, చేతికి వ‌చ్చిన అవ‌కాశాల్ని జార‌విడ‌చుకొంటోంది.

గ‌బ్బ‌ర్ సింగ్ 2లో ముందు కాజల్‌నే అడిగారు. కానీ నో చెప్పింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌లాంటి హీరో సినిమాకి నో చెప్పిందేమిటి?  అని అంద‌రూ ముక్కున వేలేసుకొన్నారు. ఇప్పుడు క‌మ‌ల్‌హాస‌న్ సినిమా కూడా వ‌దులుకొంది. దీంతో మ‌ళ్లీ షాక్ తిన్నారు సినీ జ‌నాలు. ఈ సినిమాలు వ‌దులుకొనేంత బిజీలో లేదు కాజ‌ల్‌. కానీ.. ఏవేవో కుంటిసాకులు చెప్పి త‌ప్పించుకొంది.కాజ‌ల్‌.. కేవ‌లం పారితోషికం న‌చ్చ‌కే..

ఈ సినిమాల్ని వ‌దులుకొంద‌నే టాక్ వినిపిస్తోంది. డ‌బ్బుల కోసం సినిమాలు చేయ‌డం కరెక్టే. కానీ ప్ర‌తీ దాన్ని డ‌బ్బుతో ముడివేయ‌డం త‌ప్పు. ఎందుకంటే క‌మ‌ల్ సినిమాలో న‌టిస్తే జాతీయ స్థాయి గుర్తింపు ఈజీగా సంపాదించుకోవ‌చ్చు. క‌మ‌ల్ సినిమాకి ఉన్న క్రేజ్ అంత‌టిది. ఆవిష‌యం తెలిసి కూడా కాజ‌ల్‌.. ఛాన్స్ మిస్ చేసుకోవ‌డం స్వ‌యంకృతాప‌రాథం అని సినీ జనాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: