మంచు మనోజ్ హీరోగా పవన్ వడయార్ దర్శకత్వంలో లగడపాటి శిరీష అండ్ శ్రీధర్ రూపొందిస్తున్న చిత్రం పోటుగాడు. ఈ మూవీ యొక్క టీజరుని నిర్మాతలు రీసెంటుగానే విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు అనే మాట ఏమిటంటే, “ఈ పోటుగాడి తీరు ఇంకా మారదా?” అనే. 


ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన మనోజ్ మరోసారి ఈ చిత్రంలో కూడా సరికొత్త ప్రయోగాలు చేసినట్లుగా టీజర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది. అంతకుముందు మిస్టర్ నూకయ్యలో కూడా మనోజ్ రకరకాల గెటప్స్ వేసాడు. అందరూ ఆ సినిమా విడుదలకి ముందు ఆహా, ఒహొ అన్నారు కాని విడుదల తరువాత ఒక్కరు కూడా మనోజ్ ని మేచుకున్నవారు లేరు. అదే తరహాలో మరోసారి మనోజ్ రకరకాలుగా ఈ టీజర్లో దర్శనమిచ్చాడు. 
 

ఇప్పటికి అనేక సార్లు ఈ వింత గెటప్పులతో దెబ్బ తిన్నా మనోజ్ తన తీరు మార్చుకోకపోవటం, నిజంగా అతనిలోని బలుపుకి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు సినీ జనాలు. మరి ఈ బలుపు ఈ సారైనా వర్క్ అవుట్ అవుతుందో లేదో, ఆఅతిని భరించిన దర్శకుడు పవన్ వడియార్ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: