టాప్ హీరోలతో సమానంగా పేరు తెచ్చుకున్న బ్రహ్మి పై సరికిత్త ఉహాగానాలు వినపడుతున్నాయి. బ్రహ్మానందం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నాడని కొత్తగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి .  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు బ్రహ్మీ ప్రరాపా నుంచి పోటీ చేయ‌డానికి ప్రయ‌త్నించార‌ని, చివరి నిమిషంలో పోటీ నుంచి త‌ప్పుకొన్నార‌ని అప్పట్లో చెప్పుకొన్నారు. బ్రహ్మీకి ఉన్న క్రేజ్‌నీ, విప‌రీత‌మైన ఫాలోయింగ్‌నీ క్యాష్ చేసుకోవాల‌ని వివిధ రాజ‌కీయ పార్టీలు అన్ని రకాల ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం బ్రహ్మీని త‌మ వైపుకు లాక్కోవాల‌ని చూస్తున్నాయి అంటున్నారు.. అయితే బ్రహ్మానందం తెలుగుదేశం వైపే చూస్తున్నారట.

బ్రహ్మీ కోరుకొంటే గుంటూరు పార్లమెంట్ నియోజ‌క వ‌ర్గం కేటాయించ‌డానికి టీడీపీ సైతం సిద్ధంగా ఉందని అంటున్నారు.. లేదంటే స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ సీటు ఇవ్వడానికీ రెడీనే. నిర్ణయం తీసుకోవ‌ల‌సింది బ్రహ్మానంద‌మే. గుంటూరు పొలిటికల్ కింగ్ గా పేరు కంచిన రాయపాటి సాంబశివరావుకు చెక్ పెట్టాలంటే బ్రహ్మనందమే సరైన వ్యక్తి అని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. బ్రహ్మి తో పాటు అలీ వైపు కూడా తెలుగుదేశం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎప్పటినుంచో అలీ తెలుగుదేశం పట్ల అభిమానంతో ఉన్నాడని అంటారు. కానీ క్రియాశీలకంగా మాత్రం అలీ తెలుగుదేశం ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఈసారి రాజమండ్రి నుండి అలీ అసెంబ్లీ కి పోటీచేసే అవకాశం ఉన్నది.ఇప్పటికే అలీ తన తండ్రి పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి చాలా సామజిక కార్యక్రమాలు చేస్తున్నాడు.

వీరిద్దరికన్నా ముందే అడుగు పెట్టి మంత్రి కూడా అయిన బాబూమోహన్ తెలుగుదేశంలో కొనసాగుతున్న ప్రస్తుతం ఆయన గ్లామర్ అంతగా లేదు కాబట్టి జనాకర్షణ కలిగిన ఈ కమెడియన్స్ ఇద్దరినీ తెలుగుదేశంలోకి తీసుకుంటే ప్రచారానికి జనంతో పాటు ఓట్లు కూడా పడతాయని చంద్రబాబు బాలయ్య ప్లాన్ అంటున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: