మంచు విష్ణువర్ధన్ దేనికైనా రెడీతో హిట్టు అయితే కొట్టాడు గానీ మొత్తం మంచు కుటుంబమే బ్రాహ్మణ ఆగ్రహానికి గురైంది. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండడంతో బ్రాహ్మణ సంఘాలు ఉవ్వెత్తున మంచు ఫ్యామిలీపై దాడికి పాల్పడ్డాయి. అంతే కాక హోమాలు, యాగాలు జరిపించి మోహన్ బాబుకు పిండప్రధానం కూడా చేశాయి. ఇదంతా ఒక వైపు అయితే మరో వైపు మంచు విష్ణు మాత్రం కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికే సినిమా తప్పితే తాము ఎవరినీ కించపరచలేదని గట్టిగానే ప్రతిఘటించాడు.


చూడబోతే మంచు కుటుంబానికి మరో శాపం తప్పేలా లేదు. అన్న విష్ణు చేయగా లేనిది, బ్రాహ్మణులని నేను కిండెల్ చేస్తే తప్పేంటి అనుకున్నాడో గాని ‘పోటుగాడు’ సినిమాలో అచ్చు అన్నయ్య దేనికైనా రెడీలాంటి బ్రాహ్మణ గెటప్పులో దర్శనమిచ్చాడు. కేవలం ఒక్క సీను వరకే ఈ అతి పరిమితం అయితే మంచిది లేదంటే మళ్ళీ రచ్చరచ్చే. కన్నడంలో సూపర్ హిట్టయిన ఓ చిత్రానికి రీమేగ్గా వస్తున్న పోటుగాడు మరి ఎంతలా పొడిచేస్తాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: