మొన్నీ మధ్య రామయ్య వస్తావయ్య షూటింగులో పాల్గొంటుంటే తనలో అమ్మతనం తాలూకా ప్రేమానురాగాలు పొంగి పొర్లినట్టు సమంతా ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న ముద్దుగుమ్మ అప్పుడే పెళ్లికాక మునుపే మదర్ సెంటిమెంట్ ఎమోషన్ ఒలకపోయడం కూసంత విచిత్రంగానే ఉన్నా జనాలు నవ్వి ఊరుకున్నారు. మరి ఈ ఆలోచన అక్కినేని కుటుంబంవారికే వచ్చిందో లేక దర్శకుడు విక్రమ్ కుమార్ మనసులో పుట్టిందో ఏమో తెలీదు గాని, సమంతాను తల్లిని చేసేస్తున్నారు.


విషయం ఏమిటంటే అక్కినేని మూడు తరాల ప్రతినిధులు హీరోలుగా నటిస్తున్న ‘మనం’ చిత్రంలో నాగ చైతన్య సరసన హీరోయినయిన సమంతా కథ అనుసారంగా తల్లవుతుందట. అంటే సినిమాలో ఏఎన్నార్, నాగార్జునతో పాటు చైతు,సమంతాలు కూడా బరువైన పాత్రలే పోషిస్తున్నారన్న మాట. తండ్రి, తాత పాత్రలు పోషించడం మొదటి రెండు తరాల వరకు ఒకే అయినా ఇలా యంగ్ అండ్ ఛార్మింగ్ చైతు, సమంతాలను పేరెంట్స్ చేయడం అంటే ఒక రకంగా రిస్కే.

మరింత సమాచారం తెలుసుకోండి: