మన హీరో ప్రభాస్ ఏమిటీ? తన తండ్రిని ఏడిపించడం ఏమిటి అని అనుకుంటున్నారా, ప్రభాస్ తన తండ్రికి ఇష్టం లేని పని చెసి  ఏడిపించడం లేదు. తన తండ్రి హృదయానికి హత్తుకునే లా మాట్లాడి, తన తండ్రి సూర్యనారాయణ రాజు కంటి వెంబటి కన్నీరు వచ్చేడట్లు గా ప్రభాస్ ప్రవర్తించాడు.

ఇక అసలువిషయానికి వెళితే  చాలా రోజుల క్రితం ప్రభాస్ ఫాదర్స్ డే నాడు తన ఇంటిలో కూర్చుని పేపర్లు చూస్తున్నాడట. ఇంతకీ తనకొడుకు ‘ఫాదర్స్ డే’ అంటే ఏమిటో చెపుతాడని, ఫాదర్స్ డే అంటే ఏమిటని ప్రభాస్ తండ్రి అడిగాడట. దానికి వెంటనే ప్రభాస్ ‘నన్ను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి మా నాన్న’ అని అన్నాడట ప్రభాస్. దానితో ప్రభాస్ తండ్రి కన్నీళ్ళ పర్యంతమై తన కొడుకును కౌగిలించుకున్నాడట. ఈ సంఘటన ప్రభాస్ కు ప్రతి ఫాదర్స్ డే రోజు గుర్తుకు వచ్చీ మూడి గా ఉంటాడట.

తన తల్లి తండ్రులన్నా, తన కుటుంబ సభ్యులన్నాప్రభాస్ కు  చాలా ప్రేమ. అందుకే కాబోలు  ప్రభాస్ తన కుటుంబ సభ్యలు ఇష్ట పడిన అమ్మాయి తోనే తన పెళ్ళి అంటున్నాడు ఈ ‘బాహుబలి’... 

మరింత సమాచారం తెలుసుకోండి: