మిస్ట‌ర్ నూక‌య్య‌... మంచు మ‌నోజ్ ఇప్పుడు పోటుగాడు అవ‌తారం ఎత్తుతున్నాడు. ప‌వ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. న‌లుగురు క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. ఇందులో కూడా మ‌నోజ్ గెట‌ప్పుల‌పై త‌న‌కున్న మ‌మ‌కారం పోగొట్టుకోలేద‌ట‌. నాలుగైదు గెట‌ప్పుల్లో క‌నిపిస్తాడ‌ట‌. అంతేకాదు..

పంచ్‌లూ బాగానే ఉన్నాయ‌ట‌.మ‌నోజ్‌కి తండ్రి మోహ‌న్‌బాబుని అనుక‌రించ‌డం ఓ మ‌హా చెడ్డ అల‌వాటుగా మారింది. ఇందులోనూ తండ్రిలా డైలాగులు చెప్పేశాడ‌ట‌. సూర్యుడు ప‌గ‌లే వ‌స్తాడు, చంద్రుడు రాత్రికి వ‌స్తాడు, ఈ పోటుగాడు ఎప్పుడైనా వ‌స్తాడు.. అంటూ డైలాగులు చెప్పాడ‌ట‌.మ‌నోజ్‌, విష్ణుల‌కు ద‌ర్శ‌కుల ప‌నిలో జోక్యం చేసుకొంటార‌నే పేరుంది. ఈ సినిమానీ మ‌నోజ్ తెగ కెలికేసి త‌న పైత్యం చూపించ‌డాట‌. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: