నాగ‌చైత‌న్య‌కి తొలి హిట్ అందించిన క‌థానాయిక స‌మంత‌. ఆటోన‌గర్ సూర్య‌, మనం సినిమాల్లోనూ చైతూ ప‌క్క‌న స‌మంత క‌థానాయిక‌. నాలుగో సినిమా కూడా అందేదే. కానీ.. నో.. నావ‌ల్ల‌కాదు అని చెప్పేసింద‌ట‌. నాగ‌చైతన్య డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం హ‌లో బ్ర‌ద‌ర్‌. శ్రీ‌నివాస‌రెడ్డి ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాలో త‌మ‌న్నా, హ‌న్సిక‌లు క‌థానాయిక‌లుగా ఎంపిక‌య్యారు.ముందు.. స‌మంత పేరుని పరిశీలించార‌ట‌. అయితే.. స‌మంత కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల‌.. ఈసినిమాని వ‌దులుకొంది. దాంతో ఈ ఆఫర్ త‌మ‌న్నా చేతికి వెళ్లింది. త‌మ‌న్నా కూడా చైతూకి అచ్చొచ్చిన క‌థానాయికే. 100 %ల‌వ్‌, త‌డాఖాల‌లో చైతూతో న‌టించింది త‌మ‌న్నా.

ఆ సినిమాలు రెండూ హిట్టే. అలా... చైతూకి త‌మ‌న్నా సెంటిమెంట్ ప‌ట్టుకొంద‌న్న‌మాట‌.వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మిగిలిన తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: