మా సినిమా అదిరిపోతుంది, హిట్ కొడుతుంది - అని సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డం మామూలే. ప్ర‌మోష‌న్ల కోసం ఎన్ని అబ‌ద్ధాలైనా చెప్పుకోవ‌ల‌సి వ‌స్తుంది. మ‌న‌సుని మోసం చేసుకొని మాట్లాడ‌వ‌ల‌సి వ‌స్తుంది. కానీ... మాదే నెంబ‌ర్ వ‌న్ సినిమా, రికార్డుల‌న్నీ తిర‌గ‌రాస్తుంది అని చెప్పుకోవ‌డం అతికి పోవ‌డ‌మే.

పోటుగాడు కోసం నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ ఇలా అతి చేస్తున్నారు.ఈ యేడాది విడుద‌లైన సినిమాల్లో మా పోటుగాడు నెంబ‌ర్ వ‌న్‌... అని ఆయ‌న ముందే జోస్యం చెబుతున్నారు. అంటే ప‌వన్ అత్తారింటికి దారేది, మ‌హేష్ 1 సినిమాలు.. పోటుగాడికి పోటీ కాద‌నే క‌దా.. అర్థం.?  

పోటుగాడు టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ చేసిన వ్యాఖ్య‌లివి. టీజ‌ర్‌కే ఇలా మురిసిపోతున్నారంటే, రేపు సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేముందు ఇంకెన్ని కోత‌లు కోస్తారో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: