చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకోవ‌డం తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మామూలే. తండ్రుల పేర్లు చెప్పుకొని కొడుకులు, కూతుర్లు ఎదుగుతుంటారు. తాత‌ల పేర్లూ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయి. త‌మిళంలో మాత్రం ఈ పోక‌డ కాస్త త‌క్కువ‌గానే ఉంటుంది. ర‌జనీకాంత్ అల్లుడు ధ‌నుష్ కెరీర్ ఇందుకు నిద‌ర్శనం. ర‌జ‌నీకి త‌మిళ‌నాట ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే.. ఆ స్టార్ డ‌మ్ త‌న‌కి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా ధ‌నుష్ చెబుతున్నాడు.ర‌జనీ అల్లుడు అనే ఇమేజ్ నాకు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. నేను ఆయ‌న పేరు వాడుకోవాల‌ని కూడా చూళ్లేదు. ఆయ‌న స్టైల్‌ని నేనెప్పుడూ కాపీ కొట్ట‌లేదు. ఆ అవ‌స‌రం కూడా రాలేదు. ఎందుకంటే నావ‌న్నీ.. వేరే త‌ర‌హా సినిమాలు. ర‌జ‌నీకాంత్ క‌థ‌లు మ‌రోలా ఉంటాయి.

న‌న్ను త‌మిళ ప్రేక్ష‌కులు న‌న్నుగానే చూశారు. నాకూఅదేఇష్టం..అంటున్నాడు.అంతేకాదు. ర‌జ‌నీకాంత్‌తో ధ‌నుష్ అస‌లు సినిమా విష‌యాలే ప్ర‌స్తావించ‌డ‌ట‌. మాట్లాడుకొన్నా కొద్దిసేపేన‌ట‌. ఎవ‌రి జీవితాలు, ఎవ‌రి వ్య‌క్తిత్వాలు వారివి. ఒక‌రి జీవితాన్ని మ‌రోక‌రు ప్ర‌భావితం చేయ‌లేరు. నేను కూడా అంతే అంటున్నాడు ధ‌నుష్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: