అచ్చమైన తెలుగు అమ్మాయి అంజలి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వచ్చేదాకా ఆమె పై పెద్దగా ఎవరికీ క్రేజ్ లేదు. అయితే ఈ సినిమా విడలైన వెంటనే ఈ రాజోలు అమ్మాయి ని తెలుగు అమ్మాయిగా గుర్తించి అందరూ మురిసిపోయారు.మరికోదరైతే అంజలి సౌందర్య లేని లోటు తీరుస్తుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అటువంటి అంజలి ఇప్పుడు తను చేశున్న సినిమాలు తప్ప కొత్తగా ఏ కొత్త ప్రాజెక్ట్ లోనూ బుక్ చేసుకోవడం లేదట. ఇలా ఎందుకు జరిగింది అంటే అంజలి స్వయంకృత అపరాధమే అని చెబుతున్నారు.

ఈ మధ్య తన పిన్నితో వచ్చిన మనస్పర్ధల తో మీదియకేక్కి ఆపై కొన్ని రోజులు కనిపించకుండా మాయమైపోయి నానా రబస చేసిన అంజలి వ్యవహారంతో ఆమె పట్ల   టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఈమె పట్ల ఎంతో నెగటివ్ ప్రచారం కూడా జరిగింది. ఈమె వలన ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్లు సైతం పోలీసుల చేత కొన్ని ప్రశ్నలు తినాల్సి వచ్చిందని అంటున్నారు. ఆమె చేస్తున్న సినిమాలు కూడా కొన్ని ఆమె వలెనే ఆలస్యం అయ్యాయి.

 అందుకే ఈమెతో ఇప్పుడు సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు కొంత వెనక్కు తగ్గుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. భవిష్యత్ లో కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని ఈ చిన్నదాన్ని అవాయిడ్ చేస్తున్నారట. రవితేజ  ‘బలుపు’ సినిమా సక్సస్ ను బట్టి ఆమె భవిష్యత్ ఆదారపడి ఉంటుందని అంటున్నారు. ఒక్క సారి జీవితం వివాదాలలో పడితే మరి ఇంతే....

 

మరింత సమాచారం తెలుసుకోండి: