హీరో సిద్దార్డ్ మన టాలీవుడ్ నిర్మాతలకు నిద్రలేని రాత్రులను గురిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో పరిస్థితి ఎలా ఉందంటే ఇతడు కలలో కనిపించినా మన నిర్మాతలు ఉల్లిక్కి పడుతున్నారు. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను పెట్టి ఇంగ్లీష్ సినిమాల డబ్బింగ్ ద్వారా నాలుగు రూపాయలు వెనకేసుకున్నా నిర్మాత ఎల్. సుభ్రమణ్యంకు సమంత కలల రాజకుమారుడు సిద్దార్డ్ పీడకలగా మారాడు. ఆ మధ్య ఇతడు హీరోగా నటించిన ‘NH4’ సినిమాను మోజు పడి డబ్బింగ్ రైట్స్ తీసుకున్న ఈయనకు 4 కోట్లు నష్టం వచ్చిందట. ఈ నష్టాన్ని పూడ్చు కుందామని బ్రహ్మనందం కామెడీని నమ్ముకుని సిద్దార్డ్ హీరోగా నటించిన ‘సంధింగ్ సంధింగ్’ సినిమాను తెలుగులో 8 కోట్లకు డబ్బింగ్ రైట్స్ తెచ్చుకుని విడుదల చేస్తే ఈ నిర్మాత దురదృష్టం కొద్దీ ఈ సినిమా విడుదలైన శుక్రువారం నాడు చలో అసంబ్లీ కార్యక్రమం, ఆ మరునాడు తెలంగాణ బందు వల్ల ఈ సినిమాకు సరైన ఓపినింగ్స్ కూడా రాలేదు.

ఈ సినిమాకు ఎవరేజ్ టాక్ రావడంతో ఈ సినిమాలో కూడా నిర్మాతకు బాగా నష్టాలే వస్తాయని చెపుతున్నారు. కానీ ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. అయినా అక్కడ కూడా ప్రేక్షకులు సిద్దార్డ్ పేరు తలవకుండా హన్సిక నామ జపం చేస్తూ, సంతానం కామెడీని ఎంజాయ్ చేస్తూ ధియేటరలకు క్యూ కడుతూ ఉంటే ఇక్కడ మాత్రం బ్రహ్మనందం కామెడీ సిద్దార్డ్ కు కలిసి రాకపోవడం అతని దురదృష్టం అనుకోవాలి.

తన ప్రియుడిని గట్టెక్కించడానికి సమంత స్పెషల్ ఎపిరేన్స్ లో కనిపించినా ఆ మేజిక్ పనిచేయలేదు. దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఏ మంత్రం, మేజిక్ పనిచేయదు. మళ్ళీ అదృష్టం ఏ రూపంలో వస్తుందో మరి...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: