రోరింగ్ ఫెర్ఫామెన్స్ లో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్యకు తిరుగులేద‌న్న విష‌యం తెలిసిందే. ఒక స‌మ‌ర‌సింహా రెడ్డి, నర‌సింహా నాయుడు, ఆ మ‌ద్య సింహా ఏ సినిమా తీసుకున్నా క‌ధ వున్నా లేకున్న బాల‌య్య వే ఆఫ్ స్టైల్ డైలాగ్స్ , యాక్టింగ్ వుంటాయి. అయితే సింహాకు ముందు వ‌రుస ప్లాప్స్, సింహా త‌రువాత ప్లాప్సే ఎదుర‌వుతున్నాయి మ‌న బాల‌య్యకు. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి త‌న‌కు సింహా రూపంలో సూప‌ర్ హిట్ ఇచ్చిన బోయ‌పాటితోనే మ‌ళ్లీ జ‌ట్టుక‌ట్టాడు. దీంతో జ‌య‌సింహా( వ‌ర్కింగ్ టైటిల్) ఎలా వుండ‌బోతుంది..? బాల‌య్య బాక్సాఫీస్ ద‌గ్గర మ‌ళ్లీ తొడ‌కొడ‌తాడా...? డైలాగ్స్ అద‌ర‌గొడ‌తాడా..? అని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈసారి బాల‌య్య తొడ‌గొట్టడంలేదా...? అంతేకాదు తొడ‌కొట్టడం రోటీన్ అయిపోయింది ..ఈసారి మ‌రో విధంగా ఎమోష‌న్ పీక్ స్టేజి యాక్షన్ ఏంటో చూపిస్తా అంటున్నాడు. విష‌యం ఏంటంటే బోయ‌పాటి శ్రీను బాల‌య్య తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ప‌క్కా పొలిటిక‌ల్ ఫిల్మ్ అట‌. బాల‌య్య క్యార‌క్టర్ అధికారంలో వున్న పార్టీ నాయ‌కుల‌ను( విల‌న్లను) ఓ రేంజ్ లోతిడ‌తాడ‌ట‌( డైలాగ్స్ రూపంలో) . ఈ సినిమాకు సంబందించిన ఒక డైలాగ్ కూడా లీక్ అయింది.

విల‌న్; నేను ఎవ‌రో...నాది ఏ పార్టో....నా రేంజ్ ఏంటో తెలుసా...?
బాల‌య్య;; ( నవ్వుతూ) నువ్వు పెట్టింది ఒక పార్టీ. వుంటుంది మ‌రో పార్టిలో. సిబీఐ పేరు చెబితే వ‌ణుకుతావు. అది నీ రేంజ్?
నేను ఏ పార్టీనో....నా రేంజ్ ఏంటో....అదిగో వాళ్లను అడుగు( ఆడియెన్స్ వైపు చూపిస్తూ). చ‌రిత్ర సృష్టించిన పార్టీరా నాది. రికార్డ్స్ బ్రేక్ చేసిన ర‌క్తం రా నాది.
విల‌న్;రేయ్ నీ ప్రాణం తీస్తా.....
బాల‌య్య; రేయ్...(కోపంతో విల‌న్ మీద‌కి వంగి) )నా క‌ళ్లలో ఏర్పడ్డ ఎర్ర జీరాల పొడ‌వు చూడ‌రా నీ ఆయుషు ఏంతో తెలుస్తుంది. కంటికి క‌నిపించ‌కుండా కంట్రీ వ‌దిలి పోరా కంత్రిగా నా కొడ‌కా.?

చదువుతుంటేనే పొలిటిక‌ల్ ఫైట్ ఓ రేంజ్ లో వుంటుంద‌ని అర్ధమవుతుందిక‌దా...? అందుకే ఈ సినిమాను ఎల‌క్షన్ కి రెండు ముందు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జ‌రుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా14 రీల్స్ ఎంట‌ర్ టైన్ ఎంట్ బ్యాన‌ర్ పై రూపొందుతోంది. మ‌రి బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ డైలాగ్స్ మ‌రికొన్ని చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: