అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ ఫిలిం యాక్షన్ 3డి. ఈ నెల 21న రెండు బాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ సుంకర. ఈ సినిమా చూసిన వాళ్ళలో అదృష్టవంతులకు డిస్నీ ల్యాండ్ ట్రిప్ ఛాన్స్ ఇస్తామంటూ త‌న దైన స్టైల్ ప్రమోష‌న్ తో వూరిస్తున్నాడు అల్లరి నరేష్.

ఇక దేశంలోనే తోలి త్రీడి మూవీ గా యాక్షన్ 3డి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 3.50 కోట్లకు అమ్ముడు పోవడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.ఇది అల్లరోడి కెరీర్ లోనే టాప్. సో దానికి త‌గ్గట్టే మూవీని జ‌నాల్లోకి తీసుకు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అత్యధిక ప్రింట్లతో ప్రతి ఒక్కరు చూసేలా రంగం సిద్దం చేశారు అనిల్ సుంక‌ర‌. అందులో బాగంగా బాలీవుడ్ స్టైల్ ప్రమోష‌న్ మొద‌లెట్టారు.అదేంటంటే మూవీ చూసిన త‌రువాత టికెట్ థియేటర్ లో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ డ్రా తీస్తారు. అలా వారం రోజుల పాటు తీసిన డ్రాలో విన్ అయిన వారికి డిస్నీ ల్యాండ్ ట్రిప్ ఫ్రీ అట. సో అల్లరి నరేష్ అభిమానులారా గెట్ రెడీ టు వాచ్ అండ్ ట్రిప్. .

మరింత సమాచారం తెలుసుకోండి: