రాజమౌళి... తెలుగు చిత్ర సీమలో అగ్ర దర్శకుడు ఎవరు? అని అడిగితే ఈ జక్కన్న పేరే చెబుతారు. రాజమౌళి ముట్టుకున్న సినిమా బంగారం అయిపోతుంది. తనతో సినిమా తీస్తే చాలు అని నిర్మాతలు, అతని నుంచి పిలుపు వస్తే చాలు అని - టాప్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారు. అలాంటి జక్కన్న కూడా కాపీలు కొడుతున్నాడా? ఎవరో తీసిన సినిమాలు చూసి..

తెలుగులో మక్కీ జి మక్కీ దించేస్తున్నాడా?టాలీవుడ్ మొత్తం వెయ్యి కళ్ళతో చూస్తున్న సినిమా బాహుబలి. ఈ సినిమా కధ మహాభారతం ఆధారంగా రాసుకున్నారట. ఈ సినిమాలో గెటప్ ల కోసం హాలీవుడ్ సినిమా ట్రాయ్ ని కాపీ కొడుతున్నాడట జక్కన్న. ఇలా పక్కవాళ్ళ సినిమాలను స్పూర్తిగా తీసుకోవడం రాజమౌళికి కొత్త కాదు.  రాజమౌళికి స్టార్ హోదా తీసుకొచ్చిన సినిమా.... సింహాద్రి. ఈ సినిమా లో రజనీకాంత్ బాషా సినిమా చాయలు స్పష్టంగా కనిపిస్తాయి.అమీర్ ఖాన్  క్రికెట్ నేపధ్యంలో లగాన్ తీస్తే

- రగ్బీ నేపధ్యంగా సై సినిమా తీసాడు జక్కన్న. మర్యాద రామన్న సినిమా, అవర్ హాస్ప టాలిటీ చిత్రానికి కాపి. ఈగ సినిమా ఓ షార్ట్ ఫిలిం కి స్ఫూర్తి. మగధీర లో మిత్. గ్లాడియేటర్ చాయలు కనిపిస్తాయి. అలా విజయవంతమైన సినిమాలను తన కధలకు అనుగుణంగా మార్చుకున్నాడు రాజమౌళి. హిట్లు వస్తున్నాయి కాబట్టి ఎవరూ పట్టించుకోవడం లేదుగానీ.. తేడా వస్తే కాపీ దర్శకుడు అనే ముద్ర ఎప్పుడో పడిపోదును. 

మరింత సమాచారం తెలుసుకోండి: