దక్షినాది కధలంటే బాలీవుడ్ కి మోజు పోలేదు. పాత కదలనీ తెరగేస్తున్నారు. ఏమాత్రం రీమేక్ చేయడానికి వీలున్నా అస్సలు వదలడం లేదు. ఇప్పుడు వారి ద్రుష్టి లారెన్స్ సినిమా కాంచన పై పడింది. ఈ కామెడి త్రిలర్ ని హిందీలో రీమేక్ చేయాలని సంజయ్ లీలా బన్సాలి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి అక్కడ కూడా లారెన్స్  దర్శకత్వం వహిస్తాడట. సౌత్ కధలను హిందీ లో రీమేక్ చేసి, హిట్లు కొట్టడం ప్రభుదేవాకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు  లారెన్స్  కూడా ప్రభుదేవా బాటలోనే వెళ్తున్నాడు. నిజానికి హిందీ లో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో లారెన్స్  ప్లాన్ చేస్తున్నాడు.

అయితే రెబల్ సినిమా దారుణంగా దెబ్బ కొట్టడంతో బాలీవుడ్ కల ని కాసేపు పక్కన పెట్టాడు. ఇప్పుడు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు - హిందీ అవకాశం లారెన్స్ ని వెతుక్కుంటూ వచ్చింది. ప్రభుదేవాలా హిట్టు కొడతాడో, లేదంటే అలవాటు ప్రకారం చేతులు ఎత్తేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: