మన హీరోలు జోరు పెంచారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి పచ్చ జెండా వూపేస్తున్నారు. అల్లు అర్జున్ మొన్నే ఇద్దరు అమ్మాయిలతో సందడి చేసాడు. ఇప్పుడు  రేసు గుర్రం పరుగు పెడుతోంది. ఈలోగా మరో కొత్త కధ వినేశాడట. అల్లు అర్జున్ - గోపిచంద్ మలినేని కలయికలో ఓ సినిమా రాబోతుంది అనేది లేటెస్ట్ టాక్. 
డాన్ శీను తో మెగా ఫోన్ పట్టాడు గోపీచంద్ మలినేని. యాక్షన్, ఎంటర్తైన్మెంట్ సినిమాలు తీయడంలో సిద్దహస్తుడు అనిపించాడు. ఇప్పుడు రవితేజతో బలుపు తీస్తున్నాడు. ఈ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఆతరవాత బన్నీ తో సినిమా చేయడానికి తన ప్రయత్నాలు ముమ్మురం చేశాడు ఈ దర్శకుడు.
బలుపు సినిమాలోని కొన్ని సీన్స్ బన్నీ చూసాడట. వాటిని తెరకెక్కించిన విధానం.. బన్నీ కి తెగ  నచ్చేసిందట. ఆ పనితనం చూసి, కధ వినకుండానే గోపికి ఓకే చెప్పేశాడు బన్నీ. రేసుగుర్రం ఓ పక్క జరుగుతుండగానే ఈ సినేమానీ పట్టాలు ఎక్కించే అవకాశం వుంది. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత అని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: