అప్పుడప్పుడు బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయతతో అన్నా ఈ జూనియర్ ఎన్టీయారుకి ఆ బాలయ్య బాబాయ్ చేసింది ఏమీ లేదు. ప్రెజెంట్ పరిస్తితి చూస్తుంటే సినిమాల వరకు ఆ బాబాయే ఈ అబ్బాయి పేరు చెప్పుకోవలసిన కండిషన్ ఉందనుకోండి. అది వేరే విషయం. కానీ ఈ జూనియరుకి ఆ సీనియర్ ఎన్టీయారు అండదండలు ఉన్నాయని మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే. 
 

ఈ మధ్య కాలంలో జూనియర్ సినిమాల కోసం తీసుకుంటున్న డెసిషనులు ఆశ్చర్యంతో పాటు కొన్ని అపవాదులు తెచ్చిపెడుతున్నాయి. కేవలంహిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టరులతో మాత్రమే సినిమా చేసేందుకు ఎన్టీఆర్ పరుగులు పెడుతుండటం నిజంగానే అతని తీరుపై ఆలోచించాల్సిన పరిస్తితుల్ని ఏర్పరుస్తుంది. కానీ ఈ డెసిషన్ వెనుక జూనియర్ సూపర్ సిద్ధాంతం ఫాలో అవుతున్నాడని మాత్రం ఎవరు కనిపెట్టలేక పోతున్నారు. 
 

హిట్ డైరెక్టరే కానీ చిన్న, పెద్ద అందరినీ ఎన్టీఆర్ కలుపుకుని పోవడం ఎవరు గమనించడంలేదు. కందిరీగ మూవీ తరువాత సంతోష్ శ్రీనివాస్ వంటి చిన్న డైరెక్టరుతోనూ, స్వామి రారా తరువాత సుదీర్ వర్మతో కూడా మూవీస్ చేయడానికి ఎటువంటి ఇగో లేకుండా జూనియర్ ముందుకు వస్తే,ఎన్టీఆర్లో ఈ యాంగిల్ గమనించకుండా హిట్ డైరెక్టర్ల వెంట పడుతున్నాడని అపవాదు తెస్తున్నారు. ఒక్కసారి ఎన్టీఆరుని ఈ యాంగిల్ కూడా ట్రైచేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: