తమ జీవితాల్లో జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తుంటారు  కొద్దిమంది. ఇపుడే అదే పని చేయబోతుంది పవర్ స్టార్ భార్య రేణు దేశాయ్.
రేణు దేశాయ్ సినిమా చేయబోతోందా...?ఎవరితో ...? ఎపుడు ...? అని వరుసగా  మీకు డౌట్స్ ఎరైజ్  అవుతున్నాయిక‌దా..?. ఓకే ఆ పాయింటే  కే వస్తున్నా .

బద్రి , జాని సినిమాల్లో పవర్ స్టార్  కి జోడిగా నటించి ఆ తర్వాత నిజ జీవితంలో అత‌డికి భాగ‌ స్వామి గా మారిన ఈ కోమలాంగి ఆ మద్య పవన్ తో గొడవలు వచ్చి  చెన్నై చెక్కేసింది .మరి పవన్ తో ఏ  విషయంలో గొడవలు  అంటే  అదంతా చేప్పాలంటే  సినిమా కథ అవుతుంద‌ట‌.  విచిత్రం ఏంటంటే   రేణు దేశాయ్  ఇపుడు  చేయబోతున్న సినిమా  క‌ధ కూడా  ఇదేనట. నేటి సమాజంలో ప్రేమలు ఎలా ఉన్నాయి...? ...ఎందుకు ప్రేమ పెళిళ్లు  విఫల మౌతున్నాయి   అన్నదే ఆమె నిర్మించబోతున్న  సినిమాలో చుపించబోతుంది అట. వింటుంటే ఇదేదో పవన్ , రేణుల‌ లవ్ స్టొరీ లాగే ఉంది అనిపిస్తుందిక‌దా.? ఇపుడు ఇదే డౌట్  ఇటు ఫిలిం ఇండస్ట్రీ   అటు ఫ్యాన్స్  మొత్తానికి వచ్చేసింది.  ప‌వ‌న్ తో ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది. ? ప‌వ‌న్ కి  వున్న జాలి త‌మ కుటుంబాన్ని అప్పుల పాటు ఎలా చేసింది.? తీన్ మార్ సుంద‌రితో ప‌వ‌న్  ఎఫైర్ ఎలాంటిది..?టోట‌ల్ గా ప‌వ‌న్ గుట్టుని రేణు దేశాయ్ తెర‌పై చూపించ‌బోతున్నద‌ని   ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
��
ఇంతకీ ఈ మూవీ పేరు చేప్పలేదు క‌దూ..?. మంగ లాస్తుకే ఒన్స్ మోర్.  స్వప్నిక్ జోష్, ముక్తిక బార్వే  హీరో హీరోయిన్స్. చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే  రేణు ఈ సినిమాను నిర్మిస్తుంది మరాఠిలో . బేసిగ్గా   తను మరాఠి  కావడం వల్లే ఆ బాష‌లో  ప్రొడ్యూస్ చేస్తున్నానంటోంది ఈ  ముద్దుగుమ్మ. నిజానికి త‌నే ప్రెస్ మీట్ పెట్టి  ఈ విష‌యాన్ని  ఎనౌన్స్ చేయాల‌నుకుంద‌ట‌. కానీ నిన్ననే ఎవ‌రో ఈ వార్తను లీక్ చేశార‌ని ఫీల్ అవుతోంది. స‌రే ఏది ఏమైనా త్వర‌లోనే  మూవీ ఓపెనింగ్ క‌లుద్దాం అని సెల‌విస్తుంది సుంద‌రి.    మరి ఫ్యామిలీ పరంగా ఎలాగూ స‌క్సెస్ అవ్వలేదు. ప్యామిలీ ఫిక్చర్ తోనైనా రేణు విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.            

మరింత సమాచారం తెలుసుకోండి: