డాక్ట‌ర్ కొడుకు డాక్ట‌ర్ అవ్వ‌క‌పోయినా.. మ‌న తెలుగు నాట మాత్రం స్టార్ కొడుకు స్టారే అవుతాడు. అవ్వాలి కూడా. లేదంటే రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడు ద‌ర్శ‌క ర‌త్నాల త‌న‌యులు కూడా సినిమా రంగంపై బీభ‌త్స‌మైన ఆస‌క్తి చూపిస్తున్నారు. అందులో పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ ఒక‌డు. బాల‌న‌టుడిగా ఆకాష్ అంద‌రికీ పరిచ‌యస్థుడే.

ప్ర‌కాష్‌రాజ్ సినిమా ధోనీలో కీరోల్‌లో న‌టించాడు. త్వ‌ర‌లోనే హీరో అవుతాడ‌ట‌.ప్ర‌స్తుతం డాన్స్ నేర్చుకొంటున్నాడు ఆకాష్‌. ఇంత‌కీ ఆకాష్ మ‌దిలో ఉన్న హీరో ఎవ‌రో తెలుసా..?  సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌. ర‌జ‌నీలా గొప్ప స్టార్ కావాల‌ని ఆకాష్ క‌ల‌లు కంటున్నాడ‌ట‌. ఈ విష‌యం డాడీకి కూడా చెప్పేశాడ‌ట‌. నీ ఇష్టం - ఏదో ఒకటి అవ్వు.. అని ప‌చ్చజెండా ఊపేశార‌ట పూరి.`

`నాకు ర‌జ‌నీ సినిమాలంటే చాలా ఇష్టం. బుజ్జిగాడులో ప్ర‌భాస్ ర‌జ‌నీకి ఎంత పెద్ద ఫ్యానో నేనూ అంతే. నాకు ఆయ‌నే స్ఫూర్తి..``అని చెబుతున్నాడు ఆకాష్‌. అంటే పూరి త‌న సినిమాలో మ‌రో హీరో కోసం వెదుక్కో వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: