ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ సినిమాతో ఎవ‌రికి ఎంత ఒరిగింది?  ఈ సినిమా ఎంత వ‌సూళ్లు సాధించింది?  అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే - ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య మాత్రం ఈ సినిమా విబేధాలు సృష్టించింది. వాళ్లెవ‌రో కాదు. ఈరోజుల్లో సినిమాతో క‌లిసి ప‌నిచేస్తున్న మారుతి-ప్ర‌భాక‌ర్ రెడ్డి.ఈరోజుల్లో సినిమాకి మారుతి ద‌ర్శ‌కుడిగా, ప్ర‌భాక‌ర్‌రెడ్డి కెమెరామెన్ గా ప‌నిచేశారు. బ‌స్ స్టాప్ సినిమాకీ ఈ ద్వ‌యం క‌ల‌సి ప‌నిచేసింది.

ప్రేమ క‌థా చిత్ర‌మ్ సినిమాకి మారుతి.. తన స్నేహితుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి ని ద‌ర్శ‌కుడిగా మార్చాడు. కానీ వెనుక నుంచి సినిమాని న‌డిపించింది మాత్రం మారుతినే.ప‌బ్లిసిటీలో కూడా మారుతి త‌న ముద్ర చూపించాడు. ఈ సినిమా హిట్ట‌య్యాక‌.. ఆ పేరు మారుతికే ద‌క్కింది. ఈ సినిమా ఇప్ప‌టికీ మారుతి సినిమాగానే చ‌లామ‌ణి అవుతోంది. కానీ.. ద‌ర్శ‌కుడిగా ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్రెస్‌మీట్ల‌లో కూడా మారుతి నోట‌.. ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట రావ‌డం లేదు.

దాంతో ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌న‌స్తాపానికి గుర‌య్యాడ‌ట‌.ఈ సినిమా కోసం ఇంత క‌ష్ట‌ప‌డితే న‌న్ను తొక్కేయ‌డానికి చూస్తున్నారు.. అని స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ``ఈ సినిమాకి ప్ర‌భాక‌ర్‌రెడ్డి చేసింది ఏముంది?  అంతా నేనే చేశా` అని మారుతి చెప్పుకొంటున్నాడు. అలా.. ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య‌.. ఈ సినిమా చిచ్చు పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: