నంద‌మూరి హీరోల సినిమాలపై ర‌జ‌నీకాంత్‌కు మోజు ఎందుకో కోళీవుడ్‌కు అర్ధం కావ‌డంలేదంట‌. ఆ మ‌ధ్య యంగ్‌టైగ‌ర్ తార‌క్ న‌టించిన బాద్షా మూవీను ర‌జనీకాంత్ రిమేక్ చేస్తున్నాడంటూ వ‌చ్చిన వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియ‌దు కాని ఆ న్యూస్‌ను కోలీవుడ్ మీడియా కొట్టిపారేసింది.

ఇంత‌లోనే ర‌జనీకాంత్ మ‌రో నంద‌మూరి హీరో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీపై క‌న్ను ప‌డింద‌ని టాలీవుడ్ మీడియా ఓ స్టోరీను క్రియోట్ చేసింది. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన ఓం మూవీను ర‌జనీకాంత్ రిమేక్ చేస్తున్నాడంటూ ఆ స్టోరీ సారాంశం.

ఈ న్యూస్‌ను కోళీవుడ్ మీడియా కొట్టిపారేయ‌డ‌మే కాక‌, నంద‌మూరి హీరోల మూవీలు చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ కోలీవుడ్‌లో సంచ‌ల‌న క‌థ‌నాల‌ను న‌డుపుతుంది. ర‌జ‌నీకాంత్‌పై ఇటువంటి పుకార్లు టాలీవుడ్‌లో వ‌స్తే ఊరుకునేది లేదంటూ ఏకంగా ఓ మీడియాలో ప్రత్యేక ప్రొగ్రాంల‌ను కూడ న‌డిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: